Breaking News

అమర్‌ కారుపై దాడి.. రియాక్ట్‌ అయిన ప్రియాంక

Published on Fri, 12/22/2023 - 12:17

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌- 7 ఫైనల్‌ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద దుమారమే రేగింది. ఈ సీజన్‌లో పల్లవి ప్రశాంత్‌ విన్నర్‌ కాగా అమర్‌ దీప్‌ రన్నర్‌ అయ్యాడు. బిగ్‌ బాస్‌ ఫైనల్‌ రోజున హౌస్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమర్‌ కారుపై ఒక వర్గం ఫ్యాన్స్‌ దాడి చేశారు.  అశ్విని, గీతూ రాయల్‌ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు.

తాజాగా ఈ విషయంపై ఒక యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రియాంక రియాక్ట్‌ అయింది. అభిమానులు ఎవరైనా కానీ ఇలా దాడి చేయడం చాలా దారుణమని ఆమె ఇలా తెలిపింది. 'ఫ్యాన్స్‌ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా దారుణం. మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వ్యతిరేకించండి.. అందులో తప్పులేదు కానీ ఇలా దాడి చేయడం చాలా హేయం. ఎవరమైనా ఎంతో కష్టపడి ఒక వస్తువును కొంటాము. కానీ ఇలా కొన్ని క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్‌ కాదు. దాడి సమయంలో కారులోపల మహిళలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుంటే ఎలా..?

హౌస్‌లో గేమ్‌ పరంగా మాత్రమే మాలో గొడవలు ఉన్నాయి. టాస్క్‌ ముగియగానే పల్లవి ప్రశాంత్‌,యావర్‌,శివాజీ,అమర్‌ ఇలా అందరం చాలా బాగా కలిసే ఉండే వాళ్లం. మాలో ఎలాంటి గొడవలు లేవు.' ముఖ్యంగా చివరి 4 వారాల్లో ప్రశాంత్‌తో నాకు మంచి బాండింగ్‌ ఏర్పడింది. వాడు నిజంగానే భూమి బిడ్డ అని ఆమె తెలిపింది. కానీ ఆ ఇంటర్వ్యూ జరిగిన సమయానికి పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్‌ కాలేదు.. దీంతో ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ అరెస్ట్‌పై ఆమెకు ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాలేదు.

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)