Breaking News

Bigg Boss: ఇద్దరు భార్యలతో ‘బిగ్‌బాస్‌’లోకి.. ఎవరా కంటెస్టెంట్‌?

Published on Tue, 06/25/2024 - 13:13

బుల్లితెరపై బిగ్‌బాస్‌ షోకి ఉన్న క్రేజ్‌ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా ఈ రియాల్టీ షోకి మంచి ఆదరణ ఉంది. అందుకే ఓటీటీలో కూడా ఈ షోని రన్‌ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో రెండు సీజన్లు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అయి మంచి విజయం సాధించాయి. దీంతో తాజాగా హిందీలో బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ 3ని ప్రారంభించారు మేకర్స్‌. ఎప్పటి మాదిరిలో ట్రెండింగ్‌లో ఉన్న నటీనటులతో పాటు ఫేమస్‌ యూట్యూబర్స్‌ ఇందులో పాల్గొన్నారు. 

అయితే ప్రతి సీజన్‌లోనూ ఓ జంట ఇందులో పాల్గొంటుంది. సీజన్‌లో 3లో కూడా దాన్ని కొనసాగించారు. విచిత్రంగా ఓ కంటెస్టెంట్‌ తన ఇద్దరు భార్యలతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు. ఆ కంటెస్టెంట్‌ పేరు ఆర్మాన్‌ మాలిక్‌. అతనో ఫేమస్‌ యూట్యూబర్‌. మొదటి భార్య పాయల్ మాలిక్, రెండో భార్య క్రితికా మాలిక్ ఇద్దరితో కలిసి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. ‘బిగ్‌బాస్‌’ హిస్టరీలోనే ఇది తొలిసారి.  ఇలా ఇద్దరు భార్యలతో షోలో పాల్గొనడాన్ని బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ దేవోలినా భట్టాచార్జితో పాటు పలువురు తప్పు పట్టినా.. ఆర్మాన్‌ మాత్రం తనను తాను సమర్థించుకుంటున్నాడు. 

తమ మధ్య ఎలాంటి వివాదాలు రావని.. ఒక ఫ్యామిలీగా ఎలా ఉంటామో చూపించడానికే బిగ్‌బాస్‌లోకి వచ్చానని ఆర్మాన్‌  చెబుతున్నాడు. అంతేకాదు అభిమానులకు తన పర్సనల్‌ లైఫ్‌ ఎలా ఉంటుంది.. నా వ్యక్తిత్వం ఎలాంటి అని తెలియజేసేందుకు ఈ షో బాగా ఉపయోగపడుతుందని చెప్పాడు. తనదైన ఆటతీరుతో అందరి మనసులు గెలుచుకొని..కప్‌ కొడతానని ఆర్మాన్‌ చెప్పుకొచ్చాడు. మరి ఇద్దరి భార్యలతో కలిసి ఆర్మాన్‌ ఎలా ఆడతాడు? ఎలాంటి కంటెంట్‌ ఇస్తాడు అనేది మున్ముందు తెలుస్తుంది. 

అలా ప్రేమలో పడి..
ఆర్మాన్‌, పాయల్‌ది ప్రేమ వివాహం. పాయల్‌ ఓ బ్యాంకు ఉద్యోగిణి. ఓ సందర్భంలో బ్యాంకులోకి వెళ్లిన ఆర్మాన్‌..తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆరో రోజుల్లోనే తన ప్రేమను వ్యక్తం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల పాటు కలిసి జీవించారు. ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ  క్రితికా మాలిక్‌తో ప్రేమలో పడిపోయాడు. ఆమె పాయల్‌కు బెస్ట్‌ ఫ్రెండ్‌. పాయల్‌ ద్వారనే ఆర్మాన్‌కి పరిచయం అయింది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పాయల్‌కు తెలియకుండానే పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు ముగ్గురి మధ్య గొడవలు కూడా జరిగాయి. చివరకు పాయల్‌ అంగీకరించడంతో ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో కాపురం పెట్టారు. పాయల్‌కి ముగ్గురు సంతానం కాగా, కృతిక ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొన్నాళ్ల పాటు ఈ ముగ్గురు హైదరాబాద్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి పంజాబ్‌లోని చండీగఢ్‌లో నివసిస్తున్నారు.

తొలిసారి అనిల్‌ కపూర్‌ 
హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ 1కి కరణ్‌ జోహార్‌.. సీజన్‌ 2కి సల్మాన్‌ హోస్ట్‌గా వ్యవహరించారు. సీజన్‌ 3కి కూడా సల్మానే హోస్ట్‌ అని అంతా భావించారు. కానీ సీనియర్‌ హీరో అనిల్‌ కపూర్‌ని హోస్ట్‌గా పరిచయం చేసి షాకిచ్చారు. ఈ సీజన్‌ 3లో వడపావ్ గర్ల్ చంద్రికా దీక్షిత్, నటుడు రణ్‌వీర్ ష్రాయ్, శివానీ కుమారీ,  బాక్సర్ నీరజ్ గోయట్, ప్రముఖ లాయర్ సనా మక్బూల్ ఖాన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ విశాల్ పాండే, లవ్ కేష్ కటారియా పాల్గొన్నారు. ప్రముఖ ఓటీటీ ‘జియో సినిమా’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)