Breaking News

నా భార్యనే అంటావా? చెంప పగలగొట్టిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

Published on Sun, 07/07/2024 - 17:57

హిందీ బిగ్‌బాస్‌ను ఆదరించే అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ. అందుకే అక్కడ 17 సీజన్లు విజయవంతంగా నడిచాయి. అలాగే మధ్యలో ఓటీటీని కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ మూడో సీజన్‌ నడుస్తోంది. ఈ సారి షోలోకి యూట్యూబర్‌ అర్మాన్‌ మాలిక్‌ దంపతులను తీసుకొచ్చారు. అంటే  అర్మాన్‌తో పాటు అతడి ఇద్దరు భార్యలు కూడా హౌస్‌లోకి వచ్చారు.

గెస్టుగా వచ్చిన మొదటి భార్య
అర్మాన్‌ మొదటి భార్య పాయల్‌ ఇటీవలే షో నుంచి ఎలిమినేట్‌ అయింది. తాజాగా ఆమె వీకెండ్‌ కా వార్‌ ఎపిసోడ్‌లో సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే లోపల ఉన్న కంటెస్టెంట్‌, యూట్యూబర్‌ విశాల్‌పై విరుచుకుపడింది. అర్మాన్‌ రెండో భార్య కృతిక వదిన అంటే చాలా ఇష్టమని విశాల్‌.. ఓ కంటెస్టెంట్‌ చెవిలో గుసగుసలాడాడు. అది గుర్తు చేసిన పాయల్‌.. నువ్వు ఒక తల్లి గురించి, ఒకరి భార్య గురించి మాట్లాడుతున్నావు. ఆ విషయం తెలుసుకుని కాస్త మర్యాదగా మాట్లాడు. కృతిక గురించి అలా అనడం తప్పు అని చెప్పింది. 

చెడు ఆలోచన లేదన్న విశాల్‌
అయితే విశాల్‌ మాత్రం.. తానేదో సరదాగా చెప్పానని, తప్పుడు అభిప్రాయంతో అనలేదని వివరణ ఇచ్చాడు. ఏ చెడు ఆలోచన లేకపోతే చెవిలో గుసగుసలాడాల్సిన అవసరం ఏముంది? అదేదో తనకే నేరుగా వెళ్లి చెప్పొచ్చు కదా అని పాయల్‌ ప్రశ్నించింది. అలా కాసేపు మాట్లాడి వెళ్లిపోయింది. ఇవన్నీ విన్నాక అర్మాన్‌కు ఒళ్లు మండిపోయింది. తన భార్య గురించి మాట్లాడతాడా? అని విశాల్‌ దగ్గరకు వెళ్లి గొడవ పడ్డాడు. ఆవేశంలో అతడి చెంప చెళ్లుమనిపించాడు. 

అది కూడా తప్పేనా?
ఇద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్లడంతో మిగతా కంటెస్టెంట్లు వారిని చెరో పక్కకు తీసుకెళ్లి సముదాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా పలువురూ విశాల్‌కు మద్దతుగా నిలబడుతున్నారు. అందంగా ఉందని చెప్పడం కూడా తప్పేనా? దానికే కొట్టాలా? అయినా వదిన అనే కదా అన్నాడు.. అందులో తప్పేంటి? అని మండిపడుతున్నారు. అర్మాన్‌ మాలిక్‌ను బయటకు పంపించేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

చదవండి: లావణ్య ఎవరో కూడా తెలియదు.. తనవన్నీ అబద్ధాలే: హీరోయిన్‌

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)