Breaking News

నడిరోడ్డుపై మందు తాగుతూ బురదలో దొర్లిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

Published on Mon, 07/03/2023 - 16:38

బిగ్‌బాస్‌ ఛాన్స్‌ వస్తే ఎగిరి గంతేయడం కాదు, హౌస్‌లో కనీసం కొన్నివారాలైనా నెట్టుకువచ్చే విధంగా ఉండాలి. కానీ కొందరు దురదృష్టవశాత్తూ వారి ప్రతిభ చూపేలోపే వారం, రెండు వారాలకే ఎలిమినేట్‌ అవుతూ ఉంటారు. అయితే బిగ్‌బాస్‌ చరిత్రలో ఓ కంటెస్టెంట్‌ మాత్రం షో ప్రారంభమైన 24 గంటల్లోనే ఎలిమినేట్‌ అయ్యాడు. అతడే పునీత్‌ సూపర్‌ స్టార్‌.

సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ రెండో సీజన్‌లో ఇతడు కూడా పాల్గొన్నాడు. చిత్రవిచిత్ర వీడియోలు చేస్తూ ఫేమస్‌ అయిన ఇతడు బిగ్‌బాస్‌ హౌస్‌లో కెమెరాలతో ఆడుకునేందుకు ప్రయత్నించాడు. క్రిమిసంహారక డబ్బా కనిపించగానే దాన్ని ఓపెన్‌ చేసి మీద పోసుకున్నాడు. ఇతడి చర్యకు బిత్తరపోయిన బిగ్‌బాస్‌ వెంటనే అతడిని బయటకు పంపించేశాడు. బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులర్‌ అయిన అతడు తన పిచ్చి చేష్టలనే వీడియోగా చిత్రీకరిస్తున్నాడు.

ఈ క్రమంలో ఢిల్లీలో నడి రోడ్డుపై మందు తాగిన పునీత్‌ అక్కడున్న మురికి గుంతలో పడి దొర్లాడు. ఏదో ఘనకార్యం చేశానన్నట్లుగా చిరునవ్వుతో పైకి లేచాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 'ఛీ.. అలా మురికిగుంటలో పడితే ఆరోగ్యం దెబ్బ తింటుందన్న సోయి కూడా లేదు. ఈ దరిద్రపు పనులు కాకుండా బయట ఇంకేదైనా పని చేసి సంపాదించొచ్చు కదా', 'ఈ చెత్తంతా మాకెందుకు?', 'నిన్ను హౌస్‌ నుంచి పంపించేసి మంచి పని చేశారు', 'మురికి కాలువలో పంది బొర్లినట్లు బొర్లుతున్నాడేంటి' అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే బిగ్‌బాస్‌ షోలో తన రీఎంట్రీ గురించి మాట్లాడుతూ.. మరింత ఎక్కువ డబ్బులిస్తేనే తిరిగి హౌస్‌లో అడుగుపెడతానని చెప్పుకొస్తున్నాడు.

చదవండి: ఆ సంఘటనతో నిద్రలేని రాత్రులు.. దుల్కర్‌ సల్మాన్‌కు ఏమైంది?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)