Breaking News

ఏంటీ కీర్తి..? కుమారి ఆంటీ ఫుడ్‌ గురించి అంత మాట అనేశావ్‌..!

Published on Mon, 02/19/2024 - 12:30

సోషల్ మీడియా ప్రభావంతో స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి బాగా పాపులర్‌ అయింది. మధ్యాహ్నం 12 అయితే చాలు కుమారి ఆంటీ స్ట్రీట్‌ ఫుడ్‌ కోసం జనాలు బారులు తీరుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురు కావడం.. పోలీసులు హెచ్చరించడం వంటివి కూడా జరిగాయి. చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం రియాక్ట్‌ అయ్యే వరకు ఆమే ఫేమస్‌ అయింది. చివరకు సీఎం రేవంత్‌ రెడ్డి కూడా సమయం వచ్చినప్పుడు తాను కూడా అక్కడ భోజనం చేస్తానని చెప్పారు. అంతలా రెండు రాష్ట్రాల్లో కుమారీ ఆంటీ ఫుడ్‌ ఫేమస్‌ అయింది.

హైదరాబాద్‌లోని ఎందరో యూట్యబర్స్‌, నెటిజన్లు ఫుడ్‌ తిని తమ అభిప్రాయాలను సోషల్‌మీడియా ద్వారా షేర్‌ చేయడం చూశాం.. తాజాగా బిగ్‌బాస్‌ ఫేమ్, సీరియల్ నటి కీర్తి భట్ తనకు కాబోయే భర్త విజయ్‌ కార్తీక్‌తో పాటు కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ వద్దకు వెళ్లి భోజనం రుచి చూశారు. ఆపై వారి అభిప్రాయాన్ని యూట్యూబ్‌లో పంచుకున్నారు. మేము కుమారి ఆంటీనే చూద్దమని వస్తే.. ఆ సమయంలో ఆంటీ  లేదని కీర్తి తెలిపింది.

వైట్ రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై తిందామని తీసుకున్నాం. కానీ తమకు నచ్చలేదని కీర్తి తెలిపింది. ఎక్కువగా కారం ఉండటం వల్ల అంత రుచిగా లేదని వారు తెలిపారు. పక్కనే ఉన్న మరో రోడ్‌సైడ్‌ హోటల్‌లో భోజనం చేశామని వారు తెలిపారు. అది కొంచెం బెటర్ అని వారిద్దరూ తెలిపారు. కుమారీ ఆంటీ ఫుడ్‌కు అసలు ఎందుకు అంత హైప్ వచ్చిందో తెలియదు. ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం వైట్ రైస్, నాలుగు చికెన్ ముక్కలు వేసి రూ. 170 తీసుకున్నారు. ఆ ధరకు ఫుడ్ ఏ మాత్రం వర్త్ కాదు. మాకు నచ్చలేదు. కుమారి ఆంటీ కంటే నేను చాలా బాగా చేస్తాను.' అని కీర్తి తెలిపింది.

అందరూ ఫుడ్‌ బాగుంది అంటే మేము కూడా తిందామని అక్కడికి వచ్చినట్లు వారు తెలిపారు. ఇదీ తమ అభిప్రాయం మాత్రమేనని చెప్పారు. ఆమె వ్యాపారానికి నష్టం చేయాలని తమ అభిప్రాయం కాదని చెప్పుకొచ్చారు. ఆమె వ్యాపారం మరింత మంచిగా జరిగి ఆపై ఒక పెద్ద హోటల్‌ ఆమె పెట్టాలని కోరుకుంటున్నట్లు కీర్తి తెలిపింది. అంతే గానీ తమ అభిప్రాయాన్ని ఎవరూ తప్పుగా తీసుకోకండి అని చెప్పింది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)