Breaking News

14 ఏళ్ల బంధానికి స్వస్తి! భర్తకు టాలీవుడ్‌ హీరోయిన్‌ విడాకులు!

Published on Mon, 10/27/2025 - 13:46

పెళ్లి అనేది మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతోంది. భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా కనిపించే జంటలు కూడా చివరకు విడాకుల బాటలో పయనిస్తుండటం కొంత షాకింగ్‌గానే ఉంది. తాజాగా బుల్లితెర జంట జే భానుషాలి (Jay Bhanushali)- మహి విజ్‌ (Mahhi Vij) విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. 14 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలకాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మీకెందుకు చెప్పాలి?
ఈ మేరకు కొద్ది నెలల క్రితమే విడాకులకు దరఖాస్తు చేశారట! ముగ్గురు పిల్లల్ని పంచుకోనున్నారట! గతంలోనూ ఈ దంపతులు విడిపోతున్నట్లు ప్రచారం జరిగింది. అప్పుడు మహి స్పందిస్తూ.. ఒకవేళ నిజంగా విడిపోయినా మీకెందుకు చెప్పాలి? మీరేమైనా నా చుట్టాలా? లాయర్‌ ఫీజు కడతారా? ఛాన్స్‌ దొరికిందని ఎవరినో ఒకర్ని నిందించడం తప్ప ఏమీ చేయరు అని సీరియస్‌ అయింది.

 

బుల్లితెర జంట
మహి.. 2004లో వచ్చిన తెలుగు మూవీ తపనలో హీరోయిన్‌గా నటించింది. మలయాళం, కన్నడ భాషల్లో ఒక్కో సినిమా చేసింది. వెండితెరను నమ్ముకోకుండా బుల్లితెరపైనే సెటిల్‌ అయిపోయింది. హిందీలో అనేక సీరియల్స్‌ చేసింది.  జే భానుషాలి హేట్‌ స్టోరీ 2ల, దేసి కట్టే, ఏక్‌ పహేలీ లీలా సినిమాలు చేశాడు. బుల్లితెరపై పలు సీరియల్స్‌ చేశాడు. జే భానుషాలి, మహి 2011లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ జంటగా నాచ్‌ బలియే సీజన్‌ 5లో పాల్గొని ట్రోఫీ గెలిచారు.

ఐవీఎఫ్‌ ప్రయత్నాలు
జే.. హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లోనూ పాల్గొన్నాడు. సింగింగ్‌, డ్యాన్సింగ్‌ షోలకు యాంకరింగ్‌ చేస్తుంటాడు. జే- మహిలకు పెళ్లయిన తర్వాత చాలా ఏళ్లవరకు సంతానం కలగలేదు. దీంతో బాబు రాజ్‌వీర్‌, పాప ఖుషిలను 2017లో దత్తత తీసుకున్నారు. అప్పటికీ సంతానం కోసం ప్రయత్నించే క్రమంలో మూడుసార్లు ఐవీఎఫ్‌ ఫెయిలవగా నాలుగోసారికి సక్సెస్‌ అయింది. 2019లో ఐవీఎఫ్‌ ద్వారా కూతురు తార జన్మించింది.

 

 

చదవండి: మీసాల పిల్ల.. 13 రోజులుగా ట్రెండింగ్‌.. ఏకంగా ఎన్ని వ్యూస్‌ అంటే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)