Breaking News

తల్లి కాబోతున్న సోనియా.. సీమంతం వేడుకలో బిగ్‌బాస్‌ బ్యూటీ

Published on Sun, 07/27/2025 - 17:09

బిగ్‌బాస్‌ షోతో నెగెటివిటీ, పాపులారిటీ ఒకేసారి సంపాదించింది సోనియా ఆకుల (Soniya Akula). పెద్దోడు, చిన్నోడు అంటూ నిఖిల్‌, పృథ్వీలతో ఆమె వ్యవహరించిన తీరు జనాలకు అంతగా నచ్చలేదు. దీంతో ఫినాలే వరకు రాకుండానే ఆమె ఎలిమినేట్‌ అయిపోయింది. అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగానే ఎంటర్‌ప్రెన్యూర్‌ యష్‌ వీరగోనిని ప్రేమిస్తున్నట్లు తెలిపింది.

ఏడాది తిరగకముందే గుడ్‌న్యూస్‌
షో నుంచి బయటకు వచ్చిన వెంటనే అతడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. గతేడాది డిసెంబర్‌లో యష్‌-సోనియా పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొద్దిరోజుల క్రితమే సోనియా ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే తను తల్లికాబోతున్నట్లు ప్రకటించింది. నేడు (జూలై 27న) ఆమె సీమంతం ఘనంగా జరిగింది. 

సీమంతం ఫంక్షన్‌లో కీర్తి
ఈ వేడుకకు బుల్లితెర నటి కీర్తి ​భట్‌, ఆమెకు కాబోయే భర్త విజయ్‌ కార్తికేయన్‌తో కలిసి వెళ్లింది. తల్లి కాబోతున్న సోనియాకు చీర బహుమతిగా ఇచ్చి ఆశీర్వదించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కీర్తి.. తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అక్కాబావకు శుభాకాంక్షలు.. హ్యాపీ సీమంతం. మీరెప్పుడూ ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి. త్వరలో రాబోయే బుజ్జిపాప కోసం ఈ పిన్ని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని క్యాప్షన్‌ ఇచ్చింది. 

రెండో పెళ్లి
ఇది చూసిన అభిమానులు వీరి ప్రేమాభిమానులు చూసి ముచ్చటపడిపోతున్నారు. కాగా యష్‌ వీరగోనికి గతంలో పెళ్లయింది. ఓ బాబు కూడా ఉన్నాడు. చాలాకాలం క్రితమే భార్యకు విడాకులిచ్చే ఒంటరిగా ఉంటున్నాడు. గతేడాది సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోనియా.. జార్జ్‌ రెడ్డి, కరోనా వైరస్‌, ఆశా ఎన్‌కౌంటర్‌ చిత్రాల్లో నటించింది.

 

 

చదవండి: శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్‌ వండుకుని తిన్నా: హీరోయిన్‌

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?