Breaking News

బుల్లితెర నటి చెల్లితో ఆర్జే సూర్య ఎంగేజ్‌మెంట్‌

Published on Fri, 10/31/2025 - 09:19

తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ కంటెస్టెంట్‌, మిమిక్రీ ఆర్టిస్ట్‌, యాంకర్‌, ఆర్జే సూర్య (RJ Surya) జీవితంలో పెళ్లి ఘడియలు వచ్చేశాయి. బుల్లితెర నటి సుధీర చెల్లెలు, ఆర్జే శౌర్యతో అతడి నిశ్చితార్థం జరిగింది. గురువారం జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

ఆర్జే సూర్య ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌
ఈ ఎంగేజ్‌మెంట్‌కు బుల్లితెర నటి సుష్మ కిరణ్‌ సహా పలువురు హాజరయ్యారు. సుధీర.. కథలో రాజకుమారి సీరియల్‌లో యాక్ట్‌ చేసింది. ఆర్జే సూర్య.. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. అమ్మ బీడీలు చుడితే నాన్న తాపీ పని చేసేవాడు. తండ్రి పనికి వెళ్తేనే ఆ కుటుంబానికి పూట గడిచేది. కుటుంబ పరిస్థితి వల్ల సూర్య స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే పాన్‌ షాప్‌లో సోడా సీసాలు క్లీన్‌ చేసే పనికి కుదిరాడు. అలా రోజుకు 10 రూపాయలు సంపాదించాడు. 

మిమిక్రీ ఆర్టిస్ట్‌
ఓ అమ్మాయితో బ్రేకప్‌ అయి డిప్రెషన్‌లో ఉన్న సమయంలో ఆర్జేగా ఆఫర్‌ వచ్చింది. ఇంకేముంది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హీరోల గొంతును మిమిక్రీ చేస్తూ ఆకట్టుకున్నాడు. వాక్చాతుర్యంతో అబ్బురపరిచాడు. అలా తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లోనూ పాల్గొని ఎనిమిది వారాలు హౌస్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ఫైమాతో కలిసి బీబీ జోడీ సీజన్‌ 1లో పాల్గొని విన్నర్‌గా నిలిచాడు.

చదవండి: ఘనంగా నారా రోహిత్‌ వివాహం..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)