Breaking News

బిగ్‌బాస్‌తో పాపులారిటీ.. హీరోగా వరుస అవకాశాలు

Published on Sat, 05/27/2023 - 15:30

నటుడు కవిన్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోగా ఎదుగుతున్నారు. టీవీ సీరియల్‌ ద్వారా పరిచయమైన ఈయన ఆ తర్వాత బిగ్‌ బాస్‌ రియాల్టీ గేమ్‌ షోతో మరింత పాపులర్‌ అయ్యారు. దీంతో కవీన్‌కు సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అలా ఆయన నటించిన లిఫ్ట్‌ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయినా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇటీవల కవిన్‌ కథానాయకుడిగా నటించిన డాడా చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

కాగా తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు ఇందులో ఆయనకు జంటగా అయోత్తి చిత్రం ఫేమ్‌ ప్రీతి ఇస్రాణి నాయకగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన రోమియో పిక్చర్స్‌ సంస్థ అధినేత రాహుల్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నృత్య దర్శకుడు, నటుడు సతీష్‌ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.

దీనికి యువ క్రేజీ సంగీత దర్శకుడు అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం శుక్రవారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. చైన్నె పరిసర ప్రాంతాల్లో షూటింగును నిర్వహించి పూర్తిచేయనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇది ఈతరం యువతను ఆకట్టుకునే విధంగా కమర్షియల్‌ అంశాలతో కూడిన ఎంటర్‌టైనర్‌ కథా చిత్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)