Breaking News

ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్‌

Published on Sat, 04/12/2025 - 09:44

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ గీతూ రాయల్‌ (Geetu Royal) చెప్పినట్లు జనాలకు సింపతీ ఎక్కువే! ఎవరైనా బాధపడుతుంటే అస్సలు చూడలేరు. అన్నా, నేను రైతుబిడ్డనన్నా అని అమాయకంగా ముఖం పెట్టి ఓట్లు అడుక్కున్న పల్లవి ప్రశాంత్‌ను గెలిపించారు. అందరూ తనను ఒంటరి చేసి టార్గెట్‌ చేస్తున్నారన్న కౌశల్‌కూ విజయాన్ని అందించారు. బాలాదిత్య కన్నీళ్లతో సిగరెట్ల కోసం అర్థించినా వాటిని ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టిందని గీతూ రాయల్‌ను బిగ్‌బాస్‌ షో నుంచి ఎలిమినేట్‌ చేశారు.

ఏడ్చేసిన గీతూ..
ఎలాగో ట్రోఫీ మనదే అని డిసైడ్‌ అయిన గీతూ రాయల్‌కు ఎలిమినేషన్‌ పెద్ద షాకే ఇచ్చింది. బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ (Bigg Boss 6 Telugu) అయిపోయి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతోంది. బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలోనూ పెద్దగా కనిపించడం లేదు. అలాంటిది గీతూ రాయల్‌ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. అందులో ఆమె మాట్లాడుతూ.. నేను బిగ్‌బాస్‌ బజ్‌ చేసేటప్పుడు మా ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. 

చనిపోదామనుకున్నా
తల గోడకేసి కొట్టుకోవాలనిపించింది. ఎందుకీ లైఫ్‌.. చనిపోదాం అనుకున్న సమయంలో కూడా టీవీ షోలో పాల్గొని నాపై జోకులేస్తే నవ్వుకున్నాను. ఎందుకంటే నేను ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను చనిపోతుంటే కూడా కచ్చితంగా ఓ వీడియో తీసే పోతాను (కన్నీళ్లు పెట్టుకుంటూ). నేను గట్టిగా మాట్లాడతాను కానీ నేను చాలా వీక్‌, చాలా ఎమోషనల్‌. బిగ్‌బాస్‌ షోకి వెళ్లినప్పుడు అందరూ మెచ్చుకుంటుంటే నేనే విన్నర్‌ అనుకున్నాను. కట్‌ చేస్తే ఆరు వారాలకే ఎలిమినేట్‌ అయ్యాను. 

అందుకే వెళ్లలేదు
బయట జనాల్ని చూశాక నేను విన్నర్‌ అవను అని అర్థమైంది. అందుకే రీఎంట్రీ ఆఫర్‌ చేసినా వెళ్లలేదు. పైగా అప్పటికే డిప్రెషన్‌లో ఉన్నాను. మనిషి ఆరోగ్యానికి హానికరమైన సిగరెట్లు దాచినందుకు నేను షో నుంచి బయటకు వచ్చేశాను అని తెలిసి నా బుర్ర పాడైపోయింది. ఒక డెలివరీ బాయ్‌ నా షూస్‌ దొంగతనం చేశాడని వీడియో చేస్తే కూడా నన్నే తిట్టారు. జనాలు నన్ను నెగెటివ్‌గానే చూస్తున్నారు.

నాకు, నా భర్తకు గొడవ
ఎక్కువగా షోలలో ఎందుకు కనిపించడం లేదంటే.. ఒకానొక సమయంలో చాలా పెద్ద మొత్తంలో డబ్బిచ్చేవారు. కానీ, ఇప్పుడు సగానికి సగం తగ్గించేశారు. అందుకే వాటిని ఒప్పుకోవడం లేదు. ఇకపోతే నా భర్త వికాస్‌, నేను కలిసే ఉన్నాం. కాకపోతే ఇస్మార్ట్‌ జోడీ సమయంలో నాకు, నా భర్తకు గొడవ జరిగింది. గొడవయినప్పుడు తనతో మాట్లాడను. అలాంటిది ఆ షోకు వెళ్లి అంతా బాగున్నట్లు ఎలా నటించగలం? అందుకే ఆ షో రిజెక్ట్‌ చేశాను. మా మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. తర్వాత మళ్లీ కలిసిపోతాం అని గీతూ రాయల్‌ చెప్పుకొచ్చింది.

చదవండి: సర్కస్‌ చూస్తున్నట్లే ఉంది.. ధోని తీరుపై హీరో అసహనం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)