Breaking News

ఇంకా అదే బాధలో ఉన్న ఇమ్మాన్యుయేల్‌

Published on Sun, 02/22/2026 - 15:44

బిగ్‌బాస్‌ ట్రోఫీ సాధించాలంటే గేమ్స్‌ గెలవడం కాదు, ప్రేక్షకుల మనసు గెలవాలి. అప్పుడే టైటిల్‌ కొట్టడం సాధ్యమవుతుంది. అది ఇమ్మాన్యుయేల్‌కు బాగా తెలుసు. అందుకే షోలో అడుగుపెట్టిన మొదటి క్షణం నుంచి అందర్నీ నవ్విస్తూ, అన్ని ఆటల్లోనూ టఫ్‌ కాంపిటీషన్‌ ఇస్తూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.

గెలుపు తథ్యం అనుకుంటే..
అతడి ఆట, మాట, తీరు అన్నీ చూసిన నాగార్జున ప్రతివారం ఇమ్మూపై ప్రశంసల వర్షం కురిపించేవాడు. గోల్డెన్‌ స్టార్‌ బ్యాడ్జ్‌ ఇచ్చేవాడు. ఇంట్లోకి వచ్చినవాళ్లందరూ కూడా ఇమ్మూని ఆకాశానికి ఎత్తేయడంతో తనకు తిరుగులేదనుకున్నాడు. ట్రోఫీ గెలుస్తానని నమ్మకంగా ఉన్నాడు.

ఫైనల్స్‌లో నాలుగో స్థానం
కానీ అనూహ్యంగా ఇమ్మూ, తనూజ మధ్య ఉన్న పోటీ.. షో చివరాఖరకు వచ్చేసరికి తనూజ వర్సెస్‌ కల్యాణ్‌గా మారిపోయింది. పవన్‌ కూడా ఇమ్మూని వెనక్కు నెట్టి రేసులో ముందుకు వచ్చాడు. దాంతో ఫైనల్స్‌లో ఇమ్మూ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కల్యాణ్‌ ట్రోఫీ గెలవగా తనూజ రన్నరప్‌, పవన్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు. అసలు గెలవకపోడమే అనంతమైన బాధ అంటే ఏకంగా నాలుగో స్థానంలో ఉండటంతో ఇమ్మాన్యుయేల్‌ తట్టుకోలేకపోయాడు. 

విన్నర్‌గా ఎందుకు చూడరు?
తాజాగా బీబీ ఉత్సవం ప్రోమోలో తనకు అన్నింటికన్నా పెద్ద బాధ ఏంటో బయటపెట్టాడు. తల్లితో పాటు స్టేజీపైకి వచ్చిన ఇమ్మూ.. కమెడియన్లను విన్నర్‌గా చూడరనే విషయం నాకు తెలుసు. కానీ ఎందుకు చూడరు? మనం గేమ్స్‌ ఆడితే చూస్తారుగా అనుకున్నాను. నా నమ్మకం నిలబడలేదు. అలా అని ఓడిపోయినందుకు కొంచెం కూడా బాధపడలేదు. కానీ, అమ్మానాన్న ఇద్దరూ క్యారేజీ కట్టుకుని బైక్‌పై 90 ఊర్లు తిరిగారు. నాకు ఓటేయమని పాంప్లెట్లు పంచారు. 

హీరో చేతుల మీదుగా సన్మానం
ఇప్పటికీ నా మైండ్‌లో అదే తిరుగుతోంది అంటూ ఏడ్చేశాడు. అటు ఇమ్మూ తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం హీరో నిఖిల్‌.. స్టేజీపైకి వచ్చి ఇమ్మూ తల్లికి శాలువా కప్పి సన్మానం చేశాడు. అలాగే ఇమ్మాన్యుయేల్‌కు బిగ్‌బాస్‌ 9 ఆల్‌రౌండర్‌ అనే ట్రోఫీని అందించాడు. ఏదేమైనా ఎంత కష్టపడ్డా తనకు విజయం దక్కలేదన్న బాధ ఇమ్మూ మనసులో ఇప్పటికీ అలాగే ఉంది!

చదవండి: హీరోయిన్‌ కళ్లలో కళ్లు పెట్టి చూడాలంటే సిగ్గేసింది: బాలీవుడ్‌ హీరో

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)