Breaking News

మంగ్లీ బర్త్‌డే పార్టీ.. తప్పు నామీదకు తోస్తారేంటి?: దివి

Published on Wed, 06/11/2025 - 16:42

ఫోక్‌ సాంగ్స్‌తో ప్రజాదరణ పొందిన సింగర్‌ మంగ్లీ (Singer Mangli) పేరు తాజాగా వార్తల్లో మార్మోగుతోంది. జూన్‌ 10న తన బర్త్‌డేను పురస్కరించుకుని చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో మందు పార్టీ ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ విదేశీ మద్యంతోపాటు గంజాయి సరఫరా జరిగిందన్న పక్కా సమాచారంతో పోలీసులు​ రిసార్ట్‌పై దాడులు జరిపారు. పార్టీకి హాజరైన పలువురిని అదుపులోకి తీసుకుని పరీక్షలు జరపగా 9 మందికి గంజాయి పాజిటివ్‌గా తేలింది.

తప్పు చేసుంటే..
ఈ బర్త్‌డే పార్టీకి బిగ్‌బాస్‌ బ్యూటీ, నటి దివి వైద్య (Divi Vadthya) హాజరైంది. దీంతో ఆమె పేరు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై దివి స్పందించింది. ఫ్రెండ్‌ బర్త్‌డే అని పిలిస్తే వెళ్లాను. కానీ, అక్కడ జరిగిన పొరపాట్లను నాపైన తోయడం సరికాదు. నేను నిజంగా తప్పు చేసుంటే, ఆ మేరకు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే నా ఫోటో వేయండి. కానీ ఏ సాక్ష్యం లేకుండా నా ఫోటో వాడి నన్ను నెగెటివ్‌ చేస్తుంటే కెరీర్‌కు ఎంత ఇబ్బంది అవుతుంది?

ఫ్రెండ్‌ అని వెళ్లా..
ఎంతో కష్టపడి ఇంతదూరం వచ్చాను. ఫ్రెండ్‌ బర్త్‌డే అంటే ఎవరైనా వెళ్తారు. అలాగే, నేను కూడా ఆ అమ్మాయి నా స్నేహితురాలని వెళ్లాను. అక్కడ జరిగిన పరిస్థితులకు నేను కారణం అన్నట్లుగా ఫోటో వేస్తున్నారు. మీ ఫ్రెండ్‌ పుట్టినరోజు వేడుకల్లో ఏదైనా పొరపాటు జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? కాదు కదా.. దయచేసి నా ఫోటోలు వాడకండి. నాకు ఇబ్బంది అవుతుంది అని ఓ ఆడియో రిలీజ్‌ చేసింది. అటు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనూ హీరో, విలన్‌ కొట్టుకుని మధ్యలో కమెడియను చంపేసినట్లు ఏంటండి ఇది? అని ఆవేదన వ్యక్తం చేసింది. మంగ్లీ బర్త్‌డే పార్టీకి వెళ్లానే తప్ప అక్కడ జరిగిన పరిణామాలకు, తనకు ఎటువంటి సంబంధం లేదని దివి స్పష్టం చేసింది.

చదవండి: ఆడవారి వాష్‌రూమ్‌కు వెళ్తుంటే గెంటేశారు: ట్రాన్స్‌జెండర్‌ నటి

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)