Breaking News

రెండు వారాల్లోనే ఓటీటీలోకి 'బిగ్‌ బాస్‌' బ్యూటీ సినిమా.. అధికారిక ప్రకటన

Published on Fri, 03/29/2024 - 17:14

బిగ్‌బాస్‌ ఫేం దివి హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘లంబసింగి’.‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ డైరెక్టర్‌ కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మించాడు. ఈ మూవీ ద్వారా భరత్‌ రాజ్‌ హీరోగా పరిచయం అయ్యాడు. మార్చి 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కొంతమేరకు మెప్పించింది. ఇప్పుడు ఓటీటీలోకి విడుదల కానుంది. ఈమేరకు హాట్‌స్టార్‌ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

పోలీసు-నక్సలైట్ల పోరు నేపథ్యంలో జరిగే ఓ అందమైన ప్రేమ కథే ‘లంబసింగి’. హరిత అనే పాత్రలో హీరోయిన్‌ దివి ఒదిగిపోయింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. తెరపై కొత్త దివిని చూస్తారు. అంతలా మెప్పించిన లంబసింగి చిత్రం ఏప్రిల్‌ 2 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సినిమా విడుదలైన రెండు వారాలకే ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నడంతో ఫ్యాన్స్‌ ఖుషి అవుతున్నారు.

తెలుగు రియాలిటీ షో  బిగ్‌బాస్ ద్వారా దివికి మంచి గుర్తింపు వచ్చింది.నాలుగో సీజన్‌లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి దివి. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత పలు సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే చిరంజీవి ఆచార్య చిత్రంలో నటించిన దివి పలు వెబ్‌ సిరీస్‌లలో కూడా నటించిన విషయం తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)