Breaking News

బెట్టింగ్‌ యాప్స్‌.. ఏడాదికి రూ.10 లక్షలిస్తామన్నారు: వాసంతి

Published on Thu, 03/27/2025 - 17:02

ఈజీ మనీ కోసం చాలామంది బెట్టింగ్‌ యాప్స్‌ (Betting Apps) వాడి నిండా మునుగుతున్నారు. అదే ఈజీ మనీ కోసం ఎంతోమంది సెలబ్రిటీలు ఈ యాప్స్‌ను ప్రమోట్‌ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ జాబితాలో బుల్లితెర సెలబ్రిటీలు, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లే ఎక్కువగా ఉన్నారు. అందులో వాసంతి కృష్ణన్‌ (Vasanthi Krishnan) కూడా ఉంది. తాజాగా ఆమె బెట్టింగ్‌ యాప్స్‌ గురించి మాట్లాడింది. 

అవగాహన లేక చేశా..
వాసంతి మాట్లాడుతూ.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయమని ఆఫర్లు వస్తుంటే చేసుకుంటూ పోయాను తప్ప దీనివల్ల జనాలు ఇబ్బందిపడుతున్నారని తెలీదు. ఆ యాప్స్‌ గురించి నాకంత అవగాహన లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చాలామంది ప్రమోషన్స్‌ చేస్తున్నారు కాబట్టి ఇందులో తప్పే లేదనుకున్నాను. కనీస అవగాహన లేకుండానే సోషల్‌ మీడియాలో ప్రమోట్‌ చేశాను. అయితే.. ఇలాంటివి ఎందుకు చేస్తున్నావ్‌ అంటూ నాకు నెగెటివ్‌ కామెంట్లు రావడం మొదలైంది. ఫాలోవర్లు కూడా తగ్గిపోయారు. నా వల్ల జనాలకు చెడు జరుగుతుందేమోనని ప్రమోషన్స్‌ ఆపేశాను. ఇప్పటికీ నన్ను ప్రమోషన్స్‌ చేయమని అడుగుతూనే ఉన్నారు.

రూ.10 లక్షల ఆఫర్‌
ఏడాదికి ఇంత, రెండేళ్లకు అంత అని ప్యాకేజీలు ఇస్తామన్నారు. అదంతా నావల్ల కాదు అని ఒక వీడియో చేసి ఆపేశాను. అప్పట్లో ఏడాదికి రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ప్యాకేజీ ఇచ్చేవాళ్లు. మీరు సోషల్‌ మీడియాలో ఎలాంటి వీడియో అప్‌లోడ్‌ చేయనవసరం లేదు. కేవలం వీడియో తీసి సెండ్‌ చేయమనేవాళ్లు. కానీ నా అభిమానులు డబ్బు కోల్పోతున్నారని తెలిసి బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయడం ఆపేశాను. అందరూ పాడైపోవాలన్న దురుద్దేశంతో అయితే ప్రమోషన్స్‌ చేయలేదు అని వాసంతి వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సీరియల్స్‌ చేస్తోంది.

చదవండి: మీరు లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదు.. మహాతల్లి ఎమోషనల్‌ పోస్ట్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)