Breaking News

ఇనయ కోసం వేణుస్వామి ప్రత్యేక పూజలు.. ఇదెప్పటినుంచో?

Published on Thu, 01/18/2024 - 11:43

ఎంత కష్టపడినా కొందరికి అంత ఈజీగా విజయాలు వరించవు. కష్టానికి తోడు ఆవగింజంత అదృష్టం కూడా ఉండి తీరాలి. అది ఉన్నప్పుడే సక్సెస్‌ సాధ్యమవుతుంది. అయితే వచ్చిన సక్సెస్‌ను, క్రేజ్‌ను కాపాడుకోవడం కూడా ఇప్పటి పరిస్థితుల్లో చాలా కష్టంగా మారింది. కొందరు అలా మెరిసి ఇలా మాయమవుతున్నారు. బిగ్‌బాస్‌ బ్యూటీ ఇనయ సుల్తానా కూడా ఇదే కోవలోకి వస్తుంది. సినిమాల మీద పిచ్చితో కన్నవారిని, ఇంటిని వదిలేసి ఫిలింనగర్‌కు పారిపోయి వచ్చేసింది. 

బిగ్‌బాస్‌ తర్వాత మారని రాత
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకెక్కింది ఇనయ. తర్వాత బిగ్‌బాస్‌ షోలోనూ అడుగుపెట్టింది. తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో పాల్గొని బోలెడంత క్రేజ్‌ తెచ్చుకున్న ఇనయ సుల్తానా.. ఈ రియాలిటీ షో తర్వాత ఎన్నో ఆఫర్లు వస్తాయనుకుంది. అనుకున్నదొక్కటైతే అయినది మరొక్కటి.. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎలాగైతే అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిందో ఇప్పుడు కూడా అలాగే ఛాన్సులు ఇవ్వమని అడుగుతోంది. కానీ ఆమె మొర ఆలకించేవారే లేదు. ఇలాగైతే పని కాదనుకుందో ఏమో కానీ పూజారి వేణుస్వామిని కలిసి ప్రత్యేక పూజలు చేయించుకుంది.

నువ్వు గుడిలో పూజలు చేస్తున్నావా?
ఈ క్రమంలో మెడలో పూల మాల వేసుకుని భక్తితో మునిగిపోయిన ఆమెపై వేణుస్వామి కలశంతో నీళ్లు చల్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇనయ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఇది చూసిన జనాలు 'ఏంటి? పూజ చేయగానే ఫేమస్‌ అయిపోతాననుకుంటున్నావా?', 'వెంటనే హీరోయిన్‌గా పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇస్తారనుకుంటున్నావా?', 'ఇలాంటివన్నీ ఎలా నమ్ముతారసలు?' అని సెటైర్లు వేస్తున్నారు. ఒకరైతే 'నువ్వు ముస్లిం కదా.. పూజలు చేస్తున్నావేంటి?' అని అడగ్గా.. 'నేను భారతదేశంలో ఉన్నాను. ఇక్కడ నాకు నచ్చింది చేయగలిగే స్వేచ్ఛ ఉంది. మధ్యలో నీకేంటి సమస్య?' అని గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. 

whatsapp channel

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)