టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!
Breaking News
ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Published on Sat, 08/03/2024 - 16:15
బిగ్‌బాస్ రన్నరప్ అంబటి అర్జున్, చైతన్యరావు హీరోలుగా నటించిన చిత్రం 'తెప్ప సముద్రం'. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ నెలలో థియేటర్లలో సందడి చేసింది. ఈ మూవీలో కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా కనిపించింది. ఈ చిత్రాన్ని సైకో కిల్లర్ కథాంశంహా సతీష్ రాపోలు దర్శకత్వంతో తెరకెక్కించారు.
తాజాగా ఈ చిత్రం తాజాగా ఓటీటీకి వచ్చేసింది. శనివారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెప్ప సముద్రం అనే ఊరిలో స్కూల్ పిల్లలకు సంబంధించిన వరుస మిస్సింగ్ కేసులు నమోదవుతుంటాయి. వాటిని చేధించే కథాంశంతో ఈ సినిమాను తీసుకొచ్చారు.
కాగా.. బిగ్‌బాస్ సీజన్- 7లో అర్జున్ అంబటి కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. టాప్-5లో నిలిచిన అంబటి రన్నరప్‌గా నిలిచాడు. అంతేకాకుండా అర్జున్ అంబటి.. దేవత, అగ్నిసాక్షితో బుల్లితెర ఫ్యాన్స్‌ను అలరించాడు. లౌక్యం, తీస్‌మార్ ఖాన్ లాంటి చిత్రాల్లోనూ మెప్పించాడు.
Tags : 1