బిగ్‌బాస్‌ బజ్‌: కల్యాణ్‌ పడాల నెక్స్ట్‌ టార్గెట్‌ అదే!

Published on Mon, 12/22/2025 - 16:03

ఒక సామాస్యుడు బిగ్‌బాస్‌ ట్రోఫీ గెలిచినట్లు చరిత్రలోనే లేదు. కానీ ఆ చరిత్రను తిరగరాశాడు కామన్‌ మ్యాన్‌ పవన్‌ కల్యాణ్‌ పడాల. సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా అగ్నిపరీక్షలో అడుగుపెట్టాడు. అక్కడ తన టాలెంట్‌తో జడ్జిలను మెప్పించి తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో అడుగుపెట్టాడు.

21 మందిని వెనక్కు నెట్టి..
హౌస్‌లో టైంపాస్‌ చేసేసరికి ఎక్కువరోజులు ఉండడులే అని అంతా అనుకున్నారు. కానీ నాగార్జున ఇచ్చిన వార్నింగ్‌తో ​కల్యాణ్‌ అలర్ట్‌ అయి గేమ్‌పై ఫోకస్‌ పెట్టాడు. గేమ్‌ కోసం ఏదైనా చేసేవాడు. అలా తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 9లో పాల్గొన్న 21 మంది వెనక్కు నెట్టి బిగ్‌బాస్‌ ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లిపోయాడు.

కేక్‌ కటింగ్‌
బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు రాగానే బజ్‌ ఇంటర్వ్యూకి హాజరవ్వాల్సి ఉంటుంది. తాజాగా బజ్‌లో శివాజీతో కలిసి కేక్‌ కట్‌ చేసి సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో శివాజీ మాట్లాడుతూ.. తననే తాను చెక్కుకున్న శిల్పి అని పొగిడాడు. తన గేమ్‌ ఛేంజ్‌ అవడానికి కారణం దివ్య అని గుర్తు చేశాడు. నీలో స్పిరిట్‌ రగిలించిందే తను అనడంతో కల్యాణ్‌ దివ్యకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

గ్రేట్‌ యాక్టర్‌ అవాలనుకుంటున్నా
ఎలాంటి సినిమాలు చేద్దామనుకుంటున్నావ్‌? అన్న శివాజీ ప్రశ్నకు కల్యాణ్‌ మాట్లాడుతూ.. స్టార్‌, హీరో అని కాకుండా గ్రేట్‌ యాక్టర్‌ అవాలనుకుంటున్నాను. నాలుగు నెలల క్రితం నేనెవరికీ తెలియదు. మా ఊర్లోనే ఎవరికీ తెలీదు. అలాంటిది ఈ అవకాశం ఇచ్చి అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ వరకు నన్ను ప్రోత్సహించిన అందరికీ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చాడు.

Videos

పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ

దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు

వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే

థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్

రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు

దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు

టీడీపీ నేతల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

గురజాలలో ఉద్రిక్తత

Photos

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)