Breaking News

ఇది ప్రారంభం మాత్రమే.. బిగ్‌బాస్‌ విన్నర్‌ గుడ్‌న్యూస్‌

Published on Sun, 01/11/2026 - 12:38

తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌ విన్నర్‌గా కల్యాణ్‌ పడాల నిలిచాడు. తొలిసారి ఒక సామాన్యుడు గెలిచి చరిత్ర సృష్టించాడు. తన గెలుపు తర్వాత దాన్ని అభిమానులతో సెలబ్రేట్‌ చేసుకోవడంలో చాలా బిజీ అయిపోయాడు. అయితే ఫేమ్‌ ఉండగానే ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన చేశాడు. తనకు వచ్చిన ఐడియాను అమల్లో పెట్టేశాడు.

గుడ్‌న్యూస్‌
ఇది కేవలం ప్రారంభం మాత్రమే అంటూ ఆ గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నాడు. ఇంతకీ కల్యాణ్‌ ఏం చేశాడంటే యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. తన వ్యక్తిగత విషయాలు, సరదా క్షణాలు, గుణపాఠాలు.. ఇలా ప్రతీది అభిమానులతో పంచుకునేందుకు వీలుగా యూట్యూబ్‌ మొదలుపెట్టినట్లు వెల్లడించాడు.

జీవితాంతం రుణపడి ఉంటా..
ప్రేక్షకుల ప్రేమ వల్లే ఇంతదూరం వచ్చానని, ఇప్పుడు యూట్యూబ్‌ జర్నీకి మీ అందరి సపోర్ట్‌ కావాలని పోస్ట్‌ పెట్టాడు. తాను బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశాడు. తన గేమ్‌ నచ్చి ఓటు వేసినవారికి జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. కొత్త యూట్యూబ్‌ ఛానల్‌ మొదలుపెట్టానని, తన ఛానల్‌కు సపోర్ట్‌ చేయమని కోరాడు. ఇది చూసిన అభిమానులు అతడి కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

 

చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న బాలీవుడ్‌ హీరోయిన్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)