Breaking News

నా క్యారెక్టర్‌పై నింద.. వాష్‌రూమ్‌లో ఏడ్చేదాన్ని: రీతూ

Published on Wed, 01/14/2026 - 20:25

రీతూ చౌదరి.. విపరీతమైన నెగెటివిటీతో తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో పాల్గొంది. డిమాన్‌ పవన్‌తో లవ్‌ ట్రాక్‌ వల్ల మరింత వ్యతిరేకత మూటగట్టుకుంది. అయితే ఆమె చూపించే ప్రేమ నిజమైనదని రానురానూ ప్రేక్షకులే ఓ అంచనాకు వచ్చారు. ఏ కష్టం వచ్చినా ఫ్రెండ్‌ కోసం నిలబడే విధానం చూసి ముచ్చటపడ్డారు. 

బిగ్‌బాస్‌లో ఉండగా రీతూపై ఆరోపణలు
అవతలి వ్యక్తి దిగజారుతూ మాట్లాడినా సహనం కోల్పోకుండా కౌంటరిచ్చిన ఆమె వ్యక్తిత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అలా నెగెటివిటీని పాజిటివిటీ మల్చుకుని బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చింది రీతూ చౌదరి. అయితే ఆమె బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగా హీరో ధర్మ మహేశ్‌ భార్య గౌతమి తనపై సంచలన ఆరోపణలు చేసింది. 

నెగెటివిటీపై స్పందించిన రీతూ
ధర్మ మహేశ్‌తో క్లోజ్‌గా ఉండేదని, అర్ధరాత్రి ఇంటికి వచ్చేదని, సీసీ కెమెరా వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయంటూ ఆరోపించింది. ఈ వివాదం కూడా రీతూపై కొంత నెగెటివిటీకి కారణమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతూ తనపై జరిగిన ట్రోలింగ్‌ గురించి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ హౌస్‌లో వైల్డ్‌ కార్డ్స్‌గా వచ్చిన ఫైర్‌ స్ట్రామ్‌ కంటెస్టెంట్లు డిమాన్‌ పవన్‌కు నాతో మాట్లాడొద్దని చెప్పేవారు. 

ఓటేయమని ఫోన్‌ చేస్తే..
రీతూ బ్యాడ్‌.. నీకర్థం కావట్లేదు, ఆమె నిన్ను వాడుకుంటుంది అన్న టైపులో మాట్లాడేవారు. అదంతా చూసి అమ్మ చాలా బాధపడింది. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చాక కూడా అందర్నీ చూసి చాలా బాధగా అనిపించేది. ఇతర కంటెస్టెంట్లకు చుట్టాలందరూ ఫోన్‌ చేసి మాట్లాడుతుంటారు కదా.. మాకెవరూ చేయరు, అలా మాకెవరూ లేరు కూడా! పాపం మా అమ్మ.. నాకు ఓటు వేయండి అని ఎవరికైనా ఫోన్‌ చేస్తే కూడా.. ఆ అమ్మాయి క్యారెక్టర్‌ మంచిది కాదంటున్నారు, మేము ఓటు వేయం అన్నారు. 

నన్ను నాశనం చేయాలని చూస్తే..
నాపై లేనిపోని నిందలు, ఆరోపణలు చేసినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. మమ్మీ.. అవన్నీ లైట్‌ అని సర్దిచెప్పి వాష్‌రూమ్‌లో కూర్చుని ఏడ్చేదాన్ని. నా ఏడుపుకు కారణమైన వారికి ఏదో ఒకటి అవకుండా లేదు. నన్ను నాశనం చేయాలని చూస్తే కర్మ అనుభవిస్తారు. శివుడు నా ఎదుట ప్రత్యక్షమైతే మా మమ్మీ, అన్నయ్య కంటే ముందు నన్ను తీసుకెళ్లమని చెప్తాను అంటూ రీతూ భావోద్వేగానికి లోనైంది.

చదవండి: ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? క్యాన్సర్‌నే జయించింది

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)