Breaking News

బిగ్‌బాస్‌ స్టేజీపై రష్మిక.. భరణి సిగ్గు చూస్తే నిజంగా చచ్చిపోవాల్సిందే!

Published on Sun, 11/02/2025 - 12:20

బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) స్టేజీపైకి నేషనల్‌ క్రష్‌, కాబోయే తెలుగింటి కోడలు రష్మిక మందన్నా (Rashmika Mandanna) వచ్చేస్తోంది. రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్‌. రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో దీక్షిత్‌ శెట్టి శెట్టి హీరోగా యాక్ట్‌ చేశాడు. ఈ మూవీ నవంబర్‌ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దీక్షిత్‌, రష్మిక బిగ్‌బాస్‌ స్టేజీపైకి వచ్చారు.

సీన్స్‌ రీక్రియేషన్‌
వీరుండగానే హౌస్‌మేట్స్‌తో ఓ ఫన్‌గేమ్‌ ఆడించాడు నాగ్‌.. కొన్ని పాపులర్‌ సీన్స్‌ ప్లే చేసి.. వాటిని రీక్రియేట్‌ చేయాలన్నాడు. ఇంకేముంది, హౌస్‌మేట్స్‌ తమ కళనంతా బయటపెట్టారు. పోకిరి, అదుర్స్‌ వంటి పలు హిట్‌ సినిమాల్లోని సీన్లను రీక్రియేట్‌ చేశారు. వారి డైలాగులు, యాక్టింగ్‌ చూస్తుంటే జనాలు కడుపుబ్బా నవ్వుకోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. చివర్లో భరణి (Bharani Shankar) బ్రహ్మానందంలా మారిపోయాడు. వెంటనే మాధురి.. ఆ వెధవ పొట్టేసుకుని ప్రేమ కావాలంట ప్రేమ అని భరణిపై సెటైర్లు వేసింది.

బ్రహ్మానందంలా మారిపోయిన భరణి
అందరికీ ఏమైనా సిక్స్‌ ప్యాక్‌లు ఉన్నాయా? అని భరణి అంటుంటే.. ఇక్కడ డిస్కషన్‌ పొట్ట గురించి కాదు, పెళ్లి గురించి అని కోపగించుకుంది. దాంతో భరణి.. నువ్వలా హార్ష్‌గా మాట్లాడకు చందు, హర్టవుతాను అంటూ తెగ సిగ్గుపడిపోయాడు. అలాగే బామ్మ క్యారెక్టర్‌లో ఉన్న సంజనాతో.. మీరలా సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది అని డైలాగ్‌ వేశాడు. మొత్తానికి చాలాకాలం తర్వాత ఈ సండే ఫన్‌డేగా మారుతుందని అర్థమవుతోంది. అయితే, సోషల్‌ మీడియా లీక్స్‌ ప్రకారం మాధురి ఎలిమినేట్‌ అయిందట. అంటే రేపటినుంచి మంచి మాస్‌ మసాలా గొడవలు మిస్‌ అవుతామన్నమాట!

 

చదవండి: ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)