Breaking News

బిగ్‌బాస్‌ 'ఆయేషా' రెండుసార్లు బ్రేకప్‌.. ప్రేమికుడు చేసిన సంచలన ఆరోపణ

Published on Thu, 10/16/2025 - 13:14

బిగ్‌బాస్‌ 9 తెలుగులో వైల్డ్‌ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆయేషా దుమ్మురేపుతుంది. కేరళకు చెందిన ఆమె అసలు పేరు ఆయేషా జీనత్‌.. అయితే, కోలీవుడ్‌లోనే ఆమెకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది. 2019లో ఆమె నటించిన సత్య సీరియల్‌ తమిళ్‌లో పాపులర్‌ అయింది. దీంతో ఏకంగా సత్య-2 కూడా రన్‌ చేశారు. అలా తమిళ్‌ బిగ్‌బాస్‌-6లో ఛాన్స్‌ దక్కించుకున్న ఈ బ్యూటీ సుమారు 60రోజుల పాటు కొనసాగింది. తెలుగులో స్టార్‌మా సీరియల్స్‌ సావిత్రమ్మ గారి అబ్బాయి, ఊర్వశివో రాక్షసివో వంటి ప్రాజెక్ట్‌లతో మెప్పించింది. ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్‌లో కూడా తన స్టైల్లోనే పవర్‌ఫుల్‌గా టాలెంట్‌ చూపుతుంది.

రెండుసార్లు నిశ్చితార్థం
ఆయేషా రెండుసార్లు నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ వివాహ జీవితంలో అడుగుపెట్టలేదు. మొదట హరన్ రెడ్డిని ప్రేమించింది. అతను ఫ్యాషన్‌ ఫోటోగ్రాపర్‌గా సినిమా పరిశ్రమలోనే కొనసాగాడు. కొన్ని ప్రాజెక్ట్‌లకు వారిద్దరూ కలిసి కూడా పనిచేశారు. అయితే, అతను తనను ప్రేమిస్తూనే మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని  తెలుసుకున్న ఆయేషా బ్రేకప్‌ చెప్పింది.  ఇదే విషయాన్ని తమిళ్‌ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఆమె పంచుకుంది. అయితే, 2023లో  యోగేష్ (యోగి)తో డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. కానీ, ఎంగేజ్‌మెంట్‌తోనే అతనికి కూడా ఆమె గుడ్‌బై చెప్పేసింది. నిజాయితీ లేని ప్రేమ తనకు అవసరం లేదని ఆమె పలుమార్లు చెప్పుతూ వచ్చింది. కెరీర్‌ మీద మాత్రమే తన ఫోకస్‌ ఉంటుందని, ఈ ప్రేమలు తనకు పడవని ఒక క్లారిటీ వచ్చినట్లు పలు ఇంటర్వ్యూలో తెలిపింది.

మోసం చేసిందని ఆయేషాపై కామెంట్‌ చేసిన మొదటి ప్రేమికుడు
ఆయేషా హీరోయిన్‌గా మూడు సినిమాల్లో కూడా నటించింది. తమిళ్‌ బిగ్‌బాస్‌లో చాలా  వివాదాస్పద కంటెస్టెంట్‌గా ఆమె నిలిచింది. తోటి కంటెస్టెంట్స్‌ను ఆవేశంతో  దూషించడం వల్ల తను చెడ్డపేరు మూటకట్టుంది. దీంతో హౌస్‌ నుంచి వెళ్తున్న సమయంలో వారికి క్షమాపణలు కూడా చెప్పడం విశేషం. ఒకసారి హౌస్ట్‌గా ఉన్న కమల్‌ హాసన్‌నే ఎదిరించి వైరల్‌ అయింది. అయితే, ఆమె తమిళ్‌ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఆమె మాజీ ప్రియుడు దేవ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. 

ఆయేషాకు   ఇండస్ట్రీలో అవకాశాలు రాగానే తనను వదిలేసిందని కామెంట్‌ చేశాడు. పెళ్లి చేసుకుందామని ఇంటికి వెళ్లి అడిగితే అందరూ కలిసి తనను అవమానించడమే కాకుండా.. కొట్టి పంపించారన్నాడు. తనతో బంధం తెంచేసుకుని మరో ఇద్దరితో ఆమె ప్రేమాయణం నడిపిందని చెప్పాడు. అయితే, అతను చేసిన ఆరోపణల గురించి ఆయేషా మాత్రం ఎక్కడా కూడా మాట్లాడలేదు.  ఫైనల్‌గా ఆయేషా జీవితంలో మూడు ప్రేమకథలు బ్రేకప్‌ అయినట్లు తెలుస్తోంది.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)