Breaking News

బిగ్‌బాస్‌: 20 ఏళ్లకే లవ్‌, ప్రియుడి చేతిలో నరకం చూసిన హీరోయిన్‌

Published on Sun, 09/07/2025 - 19:56

ఆశా సైని అసలు పేరు ఫ్లోరా సైని (Flora Saini). 1999లో ప్రేమ కోసం సినిమాతో కథానాయికగా వెండితెరపై అడుగుపెట్టింది. అప్పుడే నిర్మాత తనకు చెప్పకుండా ఆశా సైని అని మార్చాడు. నువ్వు నాకు నచ్చావ్‌, నరసింహ నాయుడు, ప్రేమతో రా, మైఖేల్‌ మదన కామరాజు, ఆ ఇంట్లో వంటి పలు చిత్రాల్లో నటించింది. లక్స్‌ పాప.. సాంగ్‌తో బాగా ఫేమస్‌ అయింది. తమిళ, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోనూ యాక్ట్‌ చేసింది.

రానా నాయుడు, ద ట్రయల్‌ వెబ్‌ సిరీస్‌లలోనూ మెరిసింది. అందరమ్మాయిల్లాగే తనూ ప్రేమలో పడింది. నమ్మిన ప్రియుడి చేతిల్లో నరకం చూసింది. ఆ మధ్య తనపై దాడి జరిగినట్లుగా ఫోటోలు కూడా షేర్‌ చేసింది. ఆ ఒక్క వ్యక్తి వల్ల ప్రేమపై నమ్మకాన్నే కోల్పోయింది. నిస్సహాయ స్థితికి వెళ్లిపోయింది. ఆ ఘటన తర్వాత అమ్మానాన్నే తన ప్రపంచంగా భావించింది. ఇప్పుడు బిగ్‌బాస్‌ 9 షోలో అడుగుపెట్టింది.

అసలేం జరిగిందంటే?
20 ఏళ్ల వయసులో ఓ నిర్మాతలో ప్రేమలో పడింది ఆశా సైని. అప్పటికే దాదాపు పది చిత్రాలు చేసింది. మోడల్‌గానూ పలు బ్రాండ్స్‌ ప్రమోట్‌ చేసింది. కానీ నిర్మాతను ప్రేమించిన కొద్దిరోజులకే పరిస్థితులు తారుమరయ్యాయి. అతడు ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఫోన్‌ లాక్కున్నాడు, నటించవద్దని బలవంతం చేశాడు. ఏడాదిన్నర పాటు ఎవరితోనూ తనను మాట్లాడనివ్వలేదు. ముఖం, ఇతర ప్రైవేట్‌ భాగాలపై కొట్టాడని ఫ్లోరా సైని సోషల్‌ మీడియాలో వాపోయింది. ఒకరోజు పొట్టపై తన్నడంతో నొప్పి, బాధ భరించలేక పారిపోయానని చెప్పుకొచ్చింది. తిరిగి మామూలు మనిషి కావడానికి కొన్ని నెలలు పట్టిందని తెలిపింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)