Breaking News

బిగ్‌బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?

Published on Mon, 09/16/2024 - 07:43

బిగ్‌బాస్ 8లో రెండో వారం గడిచిపోయింది. ఊహించని విధంగా చాలా వారాలు ఉంటాడనుకున్న ఆర్జే శేఖర్ భాషా ఎలిమినేట్ అయిపోయాడు. బిగ్‌బాస్ తీసుకొచ్చిన తలతిక్క ట్విస్ట్ వల్ల ఇతడికి చాలా అన్యాయమే జరిగిందని చెప్పొచ్చు. కానీ ఏం చేస్తాం కొన్నిసార్లు అలా జరిగిపోతుంటాయంతే. అయితే ఉన్నది కొద్దిరోజులే అయినా గానీ రెమ్యునరేషన్ బాగానే వెనకేసుకున్నాడు. ఇంతకీ చెందే మొత్తం ఎంత? శేఖర్ భాషా ఎలిమినేషన్‌కి కారణం ఏమై ఉండొచ్చు.

శేఖర్ భాషా ఎలిమినేట్
బిగ్‌బాస్ 8లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. అలానే ఏ వారం ఎవరూ ఎలిమినేట్ అవుతారనేది కూడా చెప్పలేం. అలా తొలివారం బేబక్క ఎలిమినేట్ అయి బయటకొచ్చేయాల్సి వచ్చింది. ఇప్పుడు శేఖర్ భాషా ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. ఆర్జేగా ఒకప్పుడు పాపులర్. షోలోకి రాకముందు రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో ఎంటరై కాస్త క్రేజ్ తెచ్చుకున్నాడు. అలానే హౌసులోనూ కామెడీ చేసే బాధ్యతలు తీసుకున్నాడు.

(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)

అదే శాపమైందా?
కానీ బిగ్‌బాస్ తీసుకొచ్చిన కొత్త రూల్ శేఖర్ భాషాకు శాపమైంది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఓటింగ్ పరంగా చివరి రెండు స్థానాల్లో ఆదిత్య ఓం, శేఖర్ భాషఆ నిలిచారు. అయితే హౌసులో ఎవరు ఉండాలి? ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది ఆడియెన్స్ కాకుండా మిగిలిన హౌస్‌మేట్స్ డిసైడ్ చేస్తారని చెప్పి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో సీత తప్పితే అందరూ శేఖర్ భాషా హౌస్ నుంచి వెళ్లిపోవాలని తీర్మానించేశారు.

ఎన్ని లక్షలు వచ్చాయి?
ఎంటర్‌టైన్ చేస్తూ రోజురోజుకీ శేఖర్ భాషా స్ట్రాంగ్ అవుతున్నాడు. ఈ విషయం బహుశా మిగిలిన హౌస్‌మేట్స్‌‌కి అనిపించడం వల్లనో ఏమో గానీ ఎలిమినేట్ చేసి పంపిశారు. అయితే వారానికి రూ.2.5 లక్షలు చొప్పున రెండు వారాల్లో రూ.5 లక్షల్ని ఇతడు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రీసెంట్‌గానే ఇతడి భార్యకి కొడుకు పుట్టాడు. 

(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8: బాషాకు మూకుమ్మడిగా అన్యాయం.. బ్రేకప్‌ స్టోరీ చెప్పిన సీత)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)