Breaking News

బిగ్‌బాస్‌ ఫైనల్‌ కోసం 300 మంది పోలీసులు.. స్పెషల్‌ గెస్ట్‌ ఎవరంటే..?

Published on Sun, 12/15/2024 - 09:44

బిగ్‌బాస్‌ సీజన్‌–8 ఫైనల్‌ నేడు జరగనుంది. ఈ  నేపథ్యంలో  గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అల్లర్లు, గొడవలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్‌ షో జరుగుతోంది. నేడు (డిసెంబర్‌ 15) ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో విజేతను ప్రకటిస్తారు. దీంతో అక్కడకు భారీగా అభిమానులు చేరుకుంటారని పోలీసులు ముందస్తుగా అంచనా వేశారు.

గత ఏడాది డిసెంబర్‌ 17వ తేదీన బిగ్‌బాస్‌ సీజన్‌–7 ఫైనల్‌ సందర్భంగా తలెత్తిన పరిణామాలు, గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వడం తదితర అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలకు పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈమేరకు సుమారు 300 మంది పైగానే అన్నపూర్ణ స్టూడియో వద్ద పోలీసులు బందోబస్తుగా ఉండనున్నారు.

చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్
బిగ్ బాస్ తెలుగు 8కు చీఫ్ గెస్ట్‌గా రామ్‌ చరణ్‌ రానున్నారని తెలుస్తోంది. వాస్తవానికి  అతిథిగా అల్లు అర్జున్ రానున్నాడని కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి. కానీ, అల్లు అర్జున్ చుట్టూ ఇప్పటికే సంధ్య థియేటర్‌ ఘటన వివాదంగా మారడంతో ఆయన ఈ షోకు రావడంలేదని చెప్పేశారట.దీంతో అల్లు అర్జున్‌కు బదులుగా బిగ్ బాస్  ఫినాలేకు స్పెషల్ గెస్ట్‌గా రామ్ చరణ్ వచ్చే అవకాశం మెండుగా ఉందని సమాచారం. గతంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ షో కోసం అతిథిగా వచ్చారు. ఇప్పుడు చరణ్ వస్తే ఆయన చేతుల మీదుగా బిగ్ బాస్ విన్నర్‌ ట్రోఫీ అందుకుంటారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)