Breaking News

Bigg Boss 8 : మాజీలతో మసాలా వర్కౌట్‌ అయ్యేనా?

Published on Sun, 10/06/2024 - 09:03

ఈ వారం హౌస్‌లోని కంటెస్టెంట్ల మనసులో ఉన్న ముసుగులను తొలగించడానికి ఫోమ్‌ని నామినేషన్‌ పర్వంలో వాడాడు బిగ్‌ బాస్‌. ఏ నురగైనా కరిగితే అసలు పదార్థం బయట పడుతుందన్నట్టు ఈ ఫోమ్‌ ఉపయోగించిన తరువాత కంటెస్టెంట్ల అసలు రంగులు చాలానే బయటపడ్డాయని చెప్పవచ్చు. ఆ రంగులు బయటకు రాగానే ఆట మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. యథావిధిగా నామినేషన్‌లో వాడి వేడి రచ్చతో పాటు ఈ వారం క్లాన్ల మధ్య పోటీగా నిర్వహించిన వినూత్న బెలూన్‌ కాంటెస్ట్‌ ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. 

(చదవండి: కాలేజీలో మోసపోయానన్న యష్మి.. కన్నింగ్‌, సెల్ఫిష్‌ 'మణికంఠ' ఏడుపు)

ఒక్క నామినేషన్‌లో తప్ప మిగతా రోజులంతా కంటెస్టెంట్లు ఆనందంగా కనిపించారు. కానీ వారి ఆనందాన్ని ఎక్కువ సేపు బిగ్‌ బాస్‌ తట్టుకోలేకపోయాడు. అంతే బెలూన్‌ కాంటెస్ట్‌ ముందే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీస్‌ అని బాంబు పేల్చాడు. దాంతో ఇంకేముంది... ఓ పక్క తమను తాము కాపాడుకుంటూ వైల్డ్‌ కార్డ్స్‌ని హౌస్‌లోకి రానివ్వకుండా బిగ్‌ బాస్‌ పెట్టే ఆటలన్నీ ప్రాణం పెట్టి ఆడుతున్నారు ప్రస్తుత కంటెస్టెంట్స్‌. ఇక ఇదంతా ఒక ఎత్తయితే గత వారం ఊహించని ఎలిమినేషన్‌ సోనియా. కాకపోతే ఈ సోనియాని ప్రేక్షకులు ఎలిమినేట్‌ చేయలేదు... హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ చేయడం విశేషం. ముఖ్యంగా కంటెస్టెంట్స్‌లోని మిగతా లేడీ పార్టిసిపెంట్స్‌ సోనియాని వద్దనుకోవడం విడ్డూరం. ఎలిమినేట్‌ అయిన తరువాత ఈ విషయాన్ని నాగార్జునతో సోనియా బాహాటంగానే అందరి ముందు చెప్పింది. 

(చదవండి: విశ్వంలో చాలా రహస్యాలున్నాయి: దర్శకుడు శ్రీను వైట్ల)

కండబలం ఉన్నవారికి గుండెబలం తక్కువ ఉంటుందన్న విషయాన్ని నిరూపించాడు నిఖిల్‌. సోనియా ఎలిమినేట్‌ అవ్వగానే ఒక్కసారిగా భోరుమన్నాడు హౌస్‌లోనే బలవంతుడైన నిఖిల్‌. పృథ్వీ కూడా నిఖిల్‌తో జత కలిశాడు. ఆఖరికి ఇద్దరికిద్దరూ ఓ అమ్మాయి కోసం ఏడవడం ప్రేక్షకులకు కాస్త నవ్వు తెప్పించి ఉండవచ్చు. ఈ వారం చివర్లో కూడా నాగార్జున ప్రేక్షకులకు ఓ ఝలక్‌ ఇచ్చి ముగించారు. వారం మధ్యలో ఒక ఎలిమినేషన్‌ ఉంటుంది అని ప్రకటించారు. చెప్పినట్లుగానే మిడ్‌ వీక్‌లో ఆదిత్యను ఎలిమినేట్‌ చేశాడు. ఇక ఇప్పుడు హౌస్‌లో ఉన్నవాళ్ల దగ్గర నుండి ఎక్కువ మసాలా రావట్లేదని అనుకున్నాడో ఏమో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీస్‌ పేరిట ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపడానికి రెడీ అయ్యాడు బిగ్‌ బాస్‌. మరి ఈ మాజీలతో మసాల వర్కౌట్‌ అవుతుందో లేదో చూడాలి. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)