Breaking News

కన్నడ బ్యాచ్ కన్నింగ్ గేమ్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?

Published on Mon, 11/11/2024 - 13:22

బిగ్‌బాస్ 8లో పదోవారం కూడా అయిపోయింది. హరితేజ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఎప్పటిలానే సోమవారం వచ్చేసింది. దీంతో నామినేషన్స్ హంగామా మొదలైంది. హౌస్ట్ నాగార్జున ఇప్పటికే కన్నడ బ్యాచ్‌ చేసిన తప్పుల్ని చూసిచూడనట్లు వదిలేస్తున్నాడు. హౌస్‌లో మాత్రం అలా సాగదు కదా! తేజ, గౌతమ్ వాళ్లకు ఇచ్చిపడేశారు. ఈ ప్రోమోని ఇప్పుడు రిలీజ్ చేశారు.

11వ వారానికి సంబంధించిన నామినేషన్ వేసేందుకు ఈసారి హౌస్‌మేట్స్ పెయింటింగ్స్‌ని స్మాష్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ప్రేరణ.. గౌతమ్ ఫొటోని స్మాష్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య వాదన నడిచింది. నిఖిల్ వంత వచ్చేసరికి.. గతవారం తేజ చేసిన తప్పుని ఎత్తి చూపుతూ నామినేట్ చేశాడు. బయటకొచ్చిన తర్వాత తేజ వదల్లేదు. నేను చేసింది తప్పు సరే, యష్మీ చేసింది తప్పు కాదా అని ప్రశ్నించాడు. దానికి నేను సమాధానం చెప్పను అని నిఖిల్ మాట దాటవేశాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)

అలా నిఖిల్-తేజ మధ్య చాలాసేపు గొడవ జరిగింది. ఇదంతా చూస్తుంటే హోస్ట్ నాగార్జున.. వీకెండ్ వచ్చి మిగతా వాళ్లు చేసిన తప్పుల్ని చెబుతున్నాడు. అదేదో పెద్ద పాపం అన్నట్లు రచ్చ చేస్తున్నాడు. సోమవారం వచ్చేసరికి దాన్నే కన్నడ బ్యాచ్.. నామినేషన్స్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ వారం కూడా అదే జరిగేలా ఉంది. అలా ఈ వారం దాదాపు ఆరుగురు నామినేట్ అయినట్లు తెలుస్తోంది.

నామినేట్ అయినవాళ్లలో పృథ్వీ, యష్మీ, విష్ణుప్రియ, గౌతమ్, టేస్టీ తేజ, అవినాష్ ఉన్నట్లు సమాచారం. లిస్ట్ చూస్తుంటే నిఖిల్, ప్రేరణ లేరు కాబట్టి వాళ్ల ఫ్యాన్స్.. కన్నడ బ్యాచ్‌లో భాగమైన పృథ్వీ, యష్మీకి సపోర్ట్ చేస్తారు. మిగతా వాళ్లలో ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్లకు ఉంది. కానీ ఈసారి ఎందుకు విష్ణుప్రియ మీద దెబ్బపడుద్దా అనే సందేహం వస్తోంది. చూడాలి మరి ఈ వారం ఎవరు బలైపోతారో?

(ఇదీ చదవండి: నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ రిక్వెస్ట్)

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)