Breaking News

ప్రిన్స్‌ ఒక వెధవ.. ప్రశాంత్‌కు డ్రగ్‌ ఎక్కేసింది: షకీలా

Published on Mon, 09/18/2023 - 12:44

బిగ్‌బాస్‌ షోలో ఊహించిన ఎలిమినేషన్సే జరుగుతున్నాయి. మొదటివారం కిరణ్‌ రాథోడ్‌ ఎలిమినేట్‌ అవుతుందని అందరూ ఊహించగా అదే నిజమైంది. నెక్స్ట్‌ లైన్‌లో ఉంది ప్రిన్స్‌ యావర్‌ అనుకున్నారు. కారణం కిరణ్‌లాగే అతడికి కూడా తెలుగు రాదు. ఇంకేముంది, తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయం  అని అందరూ ఊహించారు. కానీ ప్రిన్స్‌ అందరి అంచనాలను తలకిందులు చేశాడు.

ఊహించినట్లే జరిగింది..
గేమ్‌లో ఫైర్‌బ్రాండ్‌లా ఆడుతూ చెలరేగిపోయాడు. తన టీమ్‌ను గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. దీంతో ప్రిన్స్‌ గ్రాఫ్‌ పెరిగి సేఫ్‌ జోన్‌లో అడుగుపెట్టాడు. ఇక హౌస్‌లో పెద్దగా ఏ గొడవల జోలికి పోని షకీలా ఎలిమినేట్‌ కావచ్చని ప్రచారం జరిగింది. చివరకు అదే నిజమైంది. రెండో వారం షకీలా అమ్మ ఎలిమినేట్‌ అయింది. తాజాగా ఆమె బిగ్‌బాస్‌ బజ్‌లో పాల్గొంది.

నువ్వేంటి నన్ను అడిగేది? షకీలా ఫైర్‌
గీతూ రాయల్‌ అడిగే పదునైన ప్రశ్నలకు అంతే పదునుగా సమాధానాలిచ్చింది. హౌస్‌లో మీరు శివాజీ బ్యాచా? సీరియల్‌ బ్యాచా? అని అడగ్గా నేను బ్యాచ్‌లో ఉన్నానని చెప్పానా? నువ్వేంటి నన్ను అడిగేది అని గీతూపై ఫైర్‌ అయింది. హౌస్‌లో రియల్‌గా ఉన్నారా? ఫేక్‌గా ఉన్నారా? అని అడగ్గా తానేదీ ప్లాన్‌ చేయలేదని చెప్పింది. పిలిస్తే వచ్చాను తప్ప ఏదో ఆశయం పెట్టుకుని ఇక్కడకు రాలేదని పేర్కొంది. తర్వాత ఒక్కో కంటెస్టెంట్‌ గురించి కుండ బద్ధలు కొట్టినట్లు మాట్లాడింది.

ప్రశాంత్‌కు డ్రగ్‌ ఎక్కేసింది
'అమర్‌ దీప్‌.. చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాడు. ప్రిన్స్‌ యావర్‌.. వెధవ, కేవలం తనకున్న బాడీని ఉపయోగించి శారీరక బలంతో అంచెలంచెలు ఎదుగుతానంటే అది అసాధ్యం. పల్లవి ప్రశాంత్‌.. బ్లడీ రాంగ్‌ యాటిట్యూడ్‌. పాపులారిటీ అనే డ్రగ్‌ ప్రశాంత్‌కు ఎక్కేసింది. ఆట సందీప్‌ హౌస్‌లో ఉండేందుకు అర్హత ఉన్న వ్యక్తి. రతిక అందంగా కనిపించే పాము.. నేను చస్తే హౌస్‌లో ఉన్న 14 మంది రావాలి. అదీ నాకు కావాల్సింది' అని చెప్పుకొచ్చింది షకీలా.

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)