Breaking News

Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!

Published on Sat, 11/25/2023 - 19:40

బిగ్‌బాస్ దత్తపుత్రిక రతిక మళ్లీ ఎలిమినేట్ అయిపోయింది. అవును మీరు విన్నది నిజమే. అయితే ఈసారి తనకు తానుగా ఎలిమినేట్ కాలేదు. రైతుబిడ్డ రివేంజ్ వల్ల ఈ బ్యూటీ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. రెండుసార్లు రతిక ఎలిమినేషన్‌కి రైతుబిడ్డ ప్రశాంతే కారణమయ్యాడు. ఇంతకీ లేటెస్ట్ ఎలిమినేషన్‌లో ఏం జరిగింది? ప్రశాంత్, రతికపై ఎలా పగ తీర్చుకున్నాడనేది ఇప్పుడు చూద్దాం.

బిగ్‌బాస్ హౌస్‌లో రతిక ఓ వింత కంటెస్టెంట్. ఎందుకంటే తొలి వారంలో ఎఫర్ట్ పెట్టింది. రెండో వారానికి వచ్చేసరికి రైతుబిడ్డ ప్రశాంత్‌తో ప్రేమ కహానీ మొదలుపెట్టింది. అక్కడివరకు బాగానే ఉంది. కానీ రోజులు గడిచేసరికి తనలోని మరో యాంగిల్ బయటకు తీసింది. అన్నిరోజులు క్లోజ్‌గా మూవ్ అయిన ప్రశాంత్‌పై రివర్స్ అయింది. దీంతో ఈమెకి ప్రశాంత్ ఫ్యాన్స్ నుంచి ఫుల్ నెగిటివిటీ ఏర్పడింది. దీనికి తోడు గేమ్స్‌లోనూ రతిక సరిగా ఆడకపోవడం మరో మైనస్. ఫలితంగా ఐదో వారం ఈమెని ఎలిమినేట్ చేసి బయటకు తోసేశారు.

(ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?)

అయితే బిగ్‌బాస్‌కి రతిక అంటే చాలా ప్రేమ. దీంతో వింత లాజిక్స్ అన్ని పెట్టి ఎలాగోలా రీఎంట్రీ పేరుతో ఈమెని మళ్లీ హౌస్‌లోకి తీసుకొచ్చారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా గేమ్స్, టాస్కులు ఆడిందా అంటే నో ఛాన్స్. శివాజీకి చెంచాగిరి చేయడమే సరిపోయింది. దానికి తోడు ప్రశాంత్ తో మళ్లీ గొడవ పెట్టుకుంది. దీంతో ఈ వారం రతిక, ప్రశాంత్.. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. ఇద్దరూ నామినేషన్స్‌లోనూ ఉన్నారు.

ఇకపోతే ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, హోస్ట్ నాగార్జున గత వారమే చెప్పారు. మరోవైపు ఈ వారం జరిగిన పోటీలో గెలిచిన ప్రశాంత్, ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. దాన్ని ఇప్పుడు వీకెండ్ ఎలిమినేషన్ సందర్భంగా ఉపయోగించేసినట్లు తెలుస్తోంది. తొలుత అశ్విని ఎలిమినేట్ అయిందట. రెండో విడతలో చివరగా రతిక, అర్జున్ మిగిలారట. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరి కోసం ఎవిక్షన్ పాస్ ఉపయోగించాలని చెప్పగా.. ప్రశాంత్ తన పాస్ ని అర్జున్ కి ఇచ్చేశాడట. అలా రతిక.. రైతుబిడ్డ వల్లే రెండోసారి ఎలిమినేట్ అయిపోయిందట. ఈ క్రమంలోనే రైతుబిడ్డ, రతికపై వేరే లెవల్ రివేంజ్ తీర్చుకున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: భర్తని పరిచయం చేసిన హీరోయిన్ ఇలియానా.. ఇతడెవరో తెలుసా?)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)