Breaking News

Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?

Published on Mon, 10/30/2023 - 18:30

బిగ్‌బాస్‌లో మిగతా రోజులు ఎలా ఉన్నాసరే నామినేషన్స్ అప్పుడు మాత్రం మంచి ఊపు వస్తుంది. ఎందుకంటే అన్నిరోజులు మనసులో దాచుకున్నవన్నీ సోమవారం బయటకు కక్కేస్తారు. తమ కోపాన్నంతా చూపించేస్తారు. అలా ఈసారి కూడా మంచి వాడీవేడిగా సాగాయి. అయితే ఈసారి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు తగువులాడుకోవడం మాత్రం షాకిచ్చింది. 

ఇంతకీ ఏంటి విషయం?
వరసగా ఏడు వారాలు అమ్మాయిలు ఎలిమినేట్ అయిపోయారు. ఎనిమిదో వారం మాత్రం సందీప్ ఎలిమినేట్ అ‍య్యాడు. ప్రస్తుతం తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టేశాం. ఇకపోతే ఈసారి ఒక్కో కంటెస్టెంట్.. ఇద్దర్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. నామినేట్ అయిన వ్యక్తులు.. డ్రాగన్ స్నేక్ ముందు నిల్చుంటే అందులో కలర్ పౌడర్ ముఖంపై పడుతుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్)

ప్రియాంక vs  అమరదీప్
ఈసారి అనుకోని విధంగా నామినేషన్స్ జరిగాయి. ఇన్నాళ్లు ఒకరికొకరు అండగా ఉంటూ వచ్చిన సీరియల్ బ్యాచ్.. ఇప్పుడు ఎవరికి వాళ్లు ఆడాలని డిసైడ్ అయినట్లు ఉన్నారు. శోభాని అర్జున్ నామినేట్ చేయగా, ఇక ఏది పడితే అది మాట్లాడుతున్నాడని అమరదీప్‌తో ప్రియాంక గొడవ పెట్టుకుంది. నామినేషన్స్ కంటే ఇదే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.

ఇకపోతే తేజ.. అర్జున్, రతికని నామినేట్ చేశాడు. ప్రియాంక.. రతికని నామినేట్ చేసింది. భోలె షావళి.. ప్రియాంకని నామినేట్ చేశాడు. ఎప్పటిలానే శివాజీ బ్యాచ్‌లోని శివాజీ, ప్రశాంత్.. ఏదో పగ ఉన్నట్లు కావాలనే పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి అమరదీప్‌ని నామినేట్ చేసినట్లు ప్రోమోలో క్లియర్‌గా కనిపించింది. ఓవరాల్ గా ఈ వారం.. ప్రియాంక, అమరదీప్, శోభాశెట్టి, అర్జున్, తేజ, రతిక, భోలె, యవర్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి?

(ఇదీ చదవండి: యాంకర్ విష్ణుప్రియకు అనారోగ్యమా? లేకపోతే అలా ఎందుకు!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)