Breaking News

ఎలిమినేషన్‌కి ముందే మరో ట్విస్ట్.. ఆ ముగ్గురిపై వేలాడుతున్న కత్తి!

Published on Sat, 10/07/2023 - 22:52

బిగ్‍‌బాస్ మినిమమ్ జోష్ ఉంటది. ఎందుకంటే వారంలో కంటెస్టెంట్స్ అందరూ చేసిన చీటింగ్, పొరబాట్లు ఇలా ప్రతి ఒక్కదాని గురించి హోస్ట్ నాగార్జున మాట్లాడుతాడు. ఈసారి కూడా అలానే ఒక్కొక్కరిని నిలబెట్టి మరీ కడిగేసే ప్రయత్నం చేశాడు. ఎలిమినేషన్ కంటే ముందు మరో ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఆ ముగ్గురికి భయం పట్టుకుంది. ఇంతకీ శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 34 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

అందరి తప్పులు 
శుక్రవారం ఏం జరిగిందనేది చూసిన నాగ్.. ప్రస్తుతానికి వచ్చేశాడు. అలా శనివారం ఎపిసోడ్ మొదలైంది. రావడంతో బెస్ట్ బడ్డీస్‌ జోడీలుగా కూర్చోవాలని చెప్పాడు. ఫస్ట్ ప్రియాంక-శోభాశెట్టిని నిలబెట్టి.. ఈ వారం మీరేం తప్పులు చేశారు? మీకేం అన్యాయం జరిగిందని అడిగాడు. స్మైల్ టాస్కులో మూడోసారి గంట కొట్టింది తామే అయినా స్టార్స్ రాలేదని ప్రియాంక చెప్పింది. అయితే తన బడ్డీ శోభా, ఆ గేమ్‌లో సంచాలక్ కావడం, మరో సంచాలక్ యవర్‌తో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవడంతో తానేం అనలేకపోయానని చెప్పింది. అయితే ఈ పోటీలో ప్రతిఒక్కరూ తప్పుగా ఆడారని నాగ్ చెప్పాడు.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!)

అమర్-సందీప్‌కి పడ్డాయ్
ఈ వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా గేమ్స్ ఆడుతూ ఎక్కువ తప్పులు చేసింది అమరదీప్-సందీప్. రెగ్యులర్ గా ఎపిసోడ్స్ చూసేవాళ్లందరికీ ఇది తెలుసు. నాగ్ కూడా ఆయా తప్పులు సందీప్-అమరదీప్‌తో చెప్పించాడు. స్మూత్‌గా ఇచ్చిపడేశాడు. ఇక ప్రతి సంచాలక్ నిర్ణయాన్ని బొక్కలో జడ్జిమెంట్ అని అమర్ అనడంపై నాగ్ సీరియస్ అయ్యాడు. 'నువ్వే తొక్కలే సంచాలక్.. నీదే బొక్కలో జడ్జిమెంట్' అని అనడంతో అమర్ సైలైంట్ అయిపోయాడు. ఇలా అందరు చేసిన తప్పుల్ని ఎత్తిచూపిన నాగార్జున.. అందరూ దొరికిపోయేలా చేశాడు.

అమర్ నిజస్వరూపం
అయితే శివాజీ మాట్లాడుతూ.. అమరదీప్‌కి ఏం చెప్పినా వినట్లేదని, ఎవరూ ఫెయిర్ గేమ్ ఆడట్లేదని తన అభిప్రాయాన్ని చెప్పాడు. మరోవైపు దొంగ టాస్కులో భాగంగా అమరదీప్.. ప్రశాంత్‌ని ఉద్దేశిస్తూ రూంలో కూర్చుని 'వాడు మేకప్ వేయకపోయినా దొంగలానే ఉంటాడు' అని చెబుతున్న వీడియోని స్క్రీన్‌పై ప్లే చేసిన నాగ్.. అమర్ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. దీంతో అతడిపై నెగిటివిటీ మరింత పెరిగిపోయింది. 

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్)

ఆ ముగ్గురిపై అనర్హత?
అయితే కంటెస్టెంట్స్ తప్పులు గురించి చెప్పి, అందరికీ స్మూత్ వార్నింగ్స్ ఇచ్చిన నాగార్జున చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు. ఎలిమినేషన్ గురించి కాకుండా ఈ హౌసులో ఉండటానికి అర్హత లేని ముగ్గురు పేర్లు చెప్పాలని అందరితో అన్నాడు. హౌస్‌మేట్స్ శోభాశెట్టి, ప్రశాంత్, సందీప్ కాకుండా మిగిలిన ఏడుగురిలోని పేర్లు చెప్పాలని అన్నాడు. దీంతో అందరూ నామినేట్ చేసినోళ్ల పేర్లు, అందుకు కారణాలు చెప్పారు.

శోభాశెట్టి.. తేజ, గౌతమ్, శివాజీ
ప్రశాంత్.. తేజ, యవర్, అమరదీప్
సందీప్ .. గౌతమ్, శివాజీ, యవర్
ప్రియాంక.. గౌతమ్, శివాజీ, శుభశ్రీ
అమరదీప్.. శుభశ్రీ, గౌతమ్, యవర్
శుభశ్రీ.. తేజ, ప్రియాంక, అమరదీప్
గౌతమ్.. తేజ, ప్రియాంక, అమరదీప్
శివాజీ.. అమరదీప్, ప్రియాంక, గౌతమ్‍
తేజ.. అమరదీప్, శుభశ్రీ, గౌతమ్
యవర్.. అమరదీప్, ప్రియాంక, తేజ

అయితే హౌసులో ఉన్న వాళ్ల ప్రకారం.. అమరదీప్, తేజ, గౌతమ్ హౌసులోని అనర్హత కలిగిన ముగ్గురుగా నిలిచారు. కానీ ప్రేక్షకుల అంచనా ప్రకారం ఆ ముగ్గురు ఎవరనేది ఆదివారం చెబుతానని నాగ్ తిరకాసు పెట్టి ఎపిసోడ్‌ని ఆపేశాడు. అలానే ఆదివారం.. ఎవరూ ఊహించని విషయం చెబుతానని కంటెస్టెంట్స్ అందరితో చెప్పాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. ఇక ఆదివారం.. కొత్తగా హౌసులోకి మరో ఆరుగురు కంటెస్టెంట్స్ రాబోతున్నారు. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!)

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)