Breaking News

మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ ప్రశాంత్.. వాళ్లకు రూ.లక్ష సాయం

Published on Fri, 03/15/2024 - 07:23

'బిగ్‌బాస్ 7' షో అయిపోయి చాలారోజులైపోయింది. రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో షోలో అడుగుపెట్టి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్.. రూ.35 లక్షల ప్రైజ్‌మనీతో రైతులకు సాయం చేస్తానన్నాడు. మూడు నెలల కావస్తున్నా ఇంకా దాని గురించి ఊసేలేదని తెగ విమర్శలు వచ్చాయి. షోలు చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తున్నాడని అందరూ మనోడిని తెగ ట్రోల్ చేశాడు. ఫైనల్‌గా ఇ‍న్నాళ్లకు మాట నిలబెట్టుకున్నాడు. తొలి సాయం చేశాడు.

(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో నిశ్చితార్థం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్)

గతంలో జరిగిన ఆరు సీజన్ల కంటే ఈసారి బిగ్‌బాస్.. ఊహించిన దానికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. దీనికి కారణం పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో వచ్చి షోలో సింపతీ కొట్టేశాడు. జనాలు కూడా ఇతడిని చెప్పింది నిజమా అబద్ధమా అనేది చూడకుండా నమ్మేశారు. ఓట్లు వేశారు. ఇక షోలో విజేతగా నిలిచిన తర్వాత అదే రోజు రాత్రి.. హైదరాబాద్‌లో ఇతడి ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్లు, బస్సుల అద్దాల పగలగొట్టి నానా రచ్చ చేశారు.

ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌ని కొన్నిరోజలు జైల్లో పెట్టడం, బెయిల్‌పై బయటకు రావడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. అయితే షోలో పల్లవి ప్రశాంత్ చెప్పినట్లు పేద రైతులకు సాయం చేస్తానని మాట మాత్రం మరిచిపోయాడా అని సందేహం వచ్చింది. అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.. గజ్వేల్‪‌లోని కొలుగురూ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి ఏకంగా రూ.లక్ష సాయమందించాడు. తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లల కోసం రూ.లక్షతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు. ఇతడికి తోడుగా సందీప్ మాస్టర్ రూ.25 వేలు సాయం చేయడం విశేషం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సందీప్-ప్రశాంత్ పోస్ట్ చేశారు.

(ఇదీ చదవండి: రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)