కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిగ్‌బాస్ 6కు డేట్ ఫిక్స్ చేసిన నాగ్, ప్రోమో చూశారా?
Published on Fri, 08/19/2022 - 17:41
బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ 4 నుంచి ప్రసారం చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. ఇందులో పిల్లలందరూ క్రికెట్ ఆడుతున్నారు. ఇంతలో సడన్‌గా బౌలర్ బంతి పట్టుకుని నేరుగా ఇంట్లోకి దూరిపోయాడు. క్షణాల్లో అక్కడున్న అందరూ మాయమయ్యారు, ఒక్క క్రికెటర్ తప్ప!
వెంటనే నాగ్ ప్రత్యక్షమై.. అట్టా ఎర్రి మొహమేసుకుని సూత్తావేంట్రా.. ఇక్కడ ఆట ఆగిందంటే అక్కడ అసలైన ఆట మొదలైనట్లే.. అంటూ బిగ్‌బాస్ కొత్త సీజన్ వచ్చే నెల నాలుగు నుంచి ప్రసారం కానుందని ప్రకటించాడు. కొత్త కంటెస్టెంట్ల కోసమే కాదు, నాగ్ మామ కోసం కూడా వెయిటింగ్ ఇక్కడ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ షో అటు టీవీతో పాటు ఇటు హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమ్ కానుంది.
చదవండి: స్టార్ హీరోల సినిమాలను వెనక్కునెట్టిన నిఖిల్ మూవీ
బిగ్‌బాస్ ఎంట్రీని కన్‌ఫర్మ్ చేసిన బుల్లితెర కమెడియన్
Tags : 1