Breaking News

Bigg Boss 6: చంటికి బిగ్‌షాక్‌.. సీజన్‌ మొత్తం కెప్టెన్సీకి దూరం

Published on Sat, 10/01/2022 - 22:59

బిగ్‌బాస్‌ హౌస్‌లో చలాకీ చంటికి వరుస షాకులు తగులుతున్నాయి. మొన్న సీక్రెట్‌ టాస్క్‌ సరిగా ఆడలేదని కెప్టెన్సీ పోటీ దారుల నుంచి తొలగించిన బిగ్‌బాస్‌.. ఈ సారి మాత్రం ఏకంగా సీజన్‌ మొత్తానికే బిగ్‌బాస్‌ కెప్టెన్‌ కాకుండా చేశాడు. ఈ నిర్ణయంలో కంటెస్టెంట్స్‌ని కూడా భాగస్వామ్యం చేశాడు.

Bigg Boss 6, Episode 28 Highlights: గతవారం కంటెస్టెంట్స్‌ ఆటతీరుని వివరిస్తూ అందరికి డబ్బులు రూపంలో మార్కులు ఇచ్చాడు నాగార్జున. ఆట బాగా ఆడిన గీతూకి, శ్రీహాన్‌లకు రూ.1000 ఇస్తూ.. గేమ్‌ సరిగా ఆడనివారికి జీరో ఇచ్చారు. హౌస్‌లో మొత్తంగా ఆరుగురు చంటి, రాజ్‌,ఆది, రోహిత్‌ అండ్‌ మెరీనా, ఆదిత్య, ఇనయాలకు జీరో వచ్చింది. వారిలో నుంచి రాజ్‌, రోహిత్‌ అండ్‌ మెరీనాలకు చెరో వంద ఇచ్చి కూర్చోబెట్టాడు నాగార్జున. మిగిలిన నలుగురిలో అంటే ఆది, చంటి, బాలాదిత్య, ఇనయాలలో ఒకరిని ఈ సీజన్‌ మొత్తం  కెప్టెన్సీ పోటీదారులు కాకుండా ఎంచుకోవాలని మిగిలిన సభ్యులను ఆదేశించాడు.

 వీరిలో బాలాదిత్యకు ఒక్కరు కూడా ఓటు వేయలేదు. ఆదికి రేవంత్‌ ఒక్కడే ఓటు వేశాడు. ఇక చంటిని తప్పించాలంటూ ముగ్గురు( రేవంత్‌, ఆరోహి, గీతూ).. ఇనయాను తొలగించాలంటూ ముగ్గురు( శ్రీహాన్‌, అర్జున్‌, రేవంత్‌) చేతులెత్తారు. చంటి, ఇనయాలకు సమాన ఓట్లు రావడంతో కొత్త కెప్టెన్‌ కీర్తి ఒపీనియన్‌ చెప్పమన్నాడు నాగార్జున. దీంతో కీర్తి తనను కెమెరాల కోసమే పని చేస్తుందని అన్నాడని చెబుతూ చంటిని నామినేట్‌ చేసింది.దీంతో చంటి కెప్టెన్సీ పోటీదారులకు దూరమయ్యాడు. నాగార్జున పెట్టిన కండీషన్‌ ప్రకారం చంటి ఇక ఈ సీజన్‌ మొత్తం కెప్టెన్‌ కాలేడు. కానీ ఇలాంటి కండీషన్స్‌ని మధ్యలో ఎత్తేసే అవకాశాలు చాలా ఉన్నాయి. గత సీజన్లలో కూడా ఇలానే కొంతమందిని కెప్టెన్సీ పోటీదారులు కాకుండా చేసి..మళ్లీ అవకాశం కల్పించారు.మరి చంటి విషయంలో ఆ హిస్టరీ రిపీట్‌ అవుతుందో లేదో చూడాలి.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)