Breaking News

లైఫ్‌లో ఒక్కసారైనా ఆ హీరోతో నటించాలి, బిగ్‌బాస్‌ ప్రైజ్‌మనీ ఏం చేశానంటే?

Published on Fri, 06/13/2025 - 18:51

తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే కౌశల్‌ మండా (Kaushal Manda) ఒక సంచలనం. ఇతడు బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో అడుగుపెట్టినప్పుడు అభిమానులు కౌశల్‌ ఆర్మీ అంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు, రోడ్డుపై ర్యాలీలు కూడా చేశారు. ఏదైతేనేం.. రెండో సీజన్‌ కప్పు కొట్టడంతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెల్చుకున్నాడు.

500 సినిమాలు చేసేవాడిని
షోలు, సినిమాలతో బిజీగా ఉన్న అతడు తాజాగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. కౌశల్‌ మాట్లాడుతూ.. 17 ఏళ్ల వయసులో రాజకుమారుడు మూవీతో సినీప్రయాణం ప్రారంభించాను. అప్పటినుంచి దాదాపు 98 సినిమాల్లో యాక్ట్‌ చేశాను. అందరూ కేవలం ఒకే వృత్తిపైనే ఫోకస్‌ పెడతారు. కానీ, నేను మల్టీ టాస్కింగ్‌ చేస్తాను. మోడలింగ్‌, ఫోటోగ్రఫీ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఫ్యాషన్‌ కొరియోగ్రఫీ.. ఇవన్నీ చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నాను. ఇవేవీ లేకుంటే ఈపాటికి 500 సినిమాలు అయిపోయేవి.

ఆ హీరోలతో పని చేయాలనుంది
హీరో ఉదయ్‌కిరణ్‌ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అతడు సుమారు 16 సినిమాలు చేసుంటే అందులో 12 చిత్రాల్లో నేనూ యాక్ట్‌ చేశాను. తనతో నాకు మంచి అనుబంధం ఉండేది. చిరంజీవి, కమల్‌ హాసన్‌ గారితో కలిసి పని చేయాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. జీవితంలో ఒక్కసారైనా ఆ ఛాన్స్‌ వస్తే బాగుండని ఎదురుచూస్తున్నాను. ఇకపోతే మా అమ్మ క్యాన్సర్‌తో పోరాడుతూ చనిపోయింది. అందుకే బిగ్‌బాస్‌ ద్వారా వచ్చిన ప్రైజ్‌మనీని క్యాన్సర్‌ బాధితులకే విరాళమిస్తానని ప్రకటించాను. ఆ మాట నిలబెట్టుకున్నాను అని చెప్పుకొచ్చాడు.

చదవండి: నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)