Breaking News

బిగ్‌బాస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. రైతుబిడ్డ ఎలిమినేట్‌..?

Published on Sat, 10/31/2026 - 18:06

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో ఎలిమినేషన్ల ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది. సాధారణంగా ప్రేక్షకుల ఓటింగ్‌ ఆధారంగా కంటెస్టెంట్ల ఎలిమినేషన్‌ జరుగుతుంది. అయితే ఈ సీజన్‌లో మాత్రం ప్రేక్షకుల ఓట్లతో పాటు హౌస్‌మేట్స్‌ ఓటింగ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో ఎలిమినేషన్‌ ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ వారం కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తూ సుధీర్‌ను ఎలిమినేట్‌ అయ్యాడు. అయితే అతడు ఇంకా హౌస్‌లోనే కొనసాగుతుండటానికి ముకేష్‌ కారణమనే చెప్పాలి.

ఝాన్సీ పవర్‌ను వదులుకునేలా
ముకేష్‌కు లభించిన సూపర్‌ పవర్‌ నేరుగా ఒకరిని సేవ్‌ చేసే అవకాశం ఇవ్వకపోయినా.. ఝాన్సీ దగ్గర ఉన్న సేవింగ్‌ పవర్‌ను తీసుకునే అవకాశం కల్పించింది. దీంతో ముకేష్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించి, సుధీర్‌ కోసం ఝాన్సీ తన పవర్‌ను వదులుకునేలా చేశాడు. ఆ పవర్‌ ఝాన్సీ దగ్గరే ఉండి ఉంటే.. ఎలిమినేషన్‌ నుంచి తనను తాను కాపాడుకోవడంతో పాటు మరో కంటెస్టెంట్‌ను కూడా సేవ్‌ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే.. ఈ వారం సడన్‌ ఎలిమినేషన్‌తో పాటు మరో ఎలిమినేషన్‌ కూడా ఉంటుందని ముందుగానే చెప్పారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఝాన్సీ ఎలిమినేషన్‌ అయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు విడుదలైన ప్రోమోలో నాగార్జున ఆమె ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కనిపించింది. స్టార్‌ పాయింట్స్‌ విషయంలోనూ ఝాన్సీకి అనుకూలమైన స్పందన రాలేదు.

 ఝాన్సీ ఎలిమినేషన్‌
మరోవైపు నరేశ్‌, రాంప్రసాద్‌ ఐదు స్టార్‌ పాయింట్స్‌ అందుకోగా.. స్టార్‌ పాయింట్స్‌ లేని కంటెస్టెంట్లలో ఝాన్సీ, సుధీర్‌, నీతూ మాస్టర్‌ ఉన్నట్లు ప్రోమోలో చూపించారు. దీంతో ఝాన్సీకి ఈ వారం గండం తప్పదా? ముకేష్‌ తీసుకున్న నిర్ణయం ఆమెకు శాపంగా మారిందా? అనే చర్చ మొదలైంది. అయితే ఝాన్సీ ఎలిమినేషన్‌పై వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ఎపిసోడ్‌ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

(ఇదీ చదవండి: భార్య విడాకులిచ్చినా ప్రేమించాడు.. సంజయ్‌ గుప్తా లవ్‌స్టోరీ..)

 

 

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)