Breaking News

Bigg Boss 10: రోహిత్‌ కళ్లు నెత్తికెక్కాయి...అతన్ని కిందకు దింపాలి.. వర్షిణి ఫైర్‌

Published on Wed, 09/09/2026 - 09:37

బిగ్‌బాస్‌ 10 రెండో రోజు ఆట రసవత్తరంగా సాగింది. ‘మహాపరీక్ష’లో భాగంగా ఇంటిసభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కూల్‌గా, కామ్‌గా ఉంటాడనుకున్న కృష్ణుడు ఒక్కసారిగా ఫైర్‌ అయ్యాడు. మరోవైపు రోహిత్‌పై యాంకర్‌ వర్షిణి చేసిన సంచలన వ్యాఖ్యలు హౌస్‌లో హీట్‌ పెంచాయి. ఇక సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే బ్యాగ్‌ టాస్క్‌ నుంచి నామినేషన్స్‌, ప్రొటెక్టివ్‌ బాస్‌ టాస్క్‌ వరకు మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం.

సైన్యం కోసం బ్యాగ్‌ టాస్క్‌
హౌస్‌మేట్స్‌ అంతా కలిసి తమ లీడర్లుగా రామ్‌ప్రసాద్‌, రోహిత్‌లను ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన 12 మంది ఇంటిసభ్యులకు నాయకులకు సైన్యంగా నిలబడేందుకు బిగ్‌బాస్‌ ఓ బ్యాగ్‌ టాస్క్‌ ఇచ్చారు. గార్డెన్‌ ఏరియాలో కొన్ని బ్యాగ్‌లను ఉంచి.. వాటిలో ఉన్న బ్యాడ్జ్‌ల ఆధారంగా సైనికులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. బ్యాగ్‌ అందుకున్న సైనికుడు దాన్ని తన నాయకుడికి ఇవ్వాలి. ఆ బ్యాగ్‌లో ఉన్న బ్యాడ్జ్‌ల ఆధారంగా నాయకులు తమ టీమ్‌లోకి సభ్యులను తీసుకోవాల్సి ఉంటుంది.

మొదట ముఖేష్‌ గౌడ బ్యాగ్‌ తీసుకుని రామ్‌ప్రసాద్‌కు ఇవ్వగా.. అందులోని తొలి బ్లూ బ్యాడ్జ్‌ను త్రిగుణ్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత రోహిత్‌ అమన్‌కు రెడ్‌ బ్యాడ్జ్‌ ఇచ్చాడు. అనంతరం టెంపర్‌ వంశీకి మరో రెడ్‌ బ్యాడ్జ్‌ ఇచ్చి తన టీమ్‌లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత శాలినిని కూడా తన జట్టులోకి తీసుకున్నాడు. అలా రామ్ ప్రసాద్.. త్రిగుణ్, ముఖేష్, సుధీర్‌, నరేష్, దేబ్జాని, చరణ్, వర్షిణి, చైత్రతో.. రోహిత్.. వంశీ, శాలిని, వంశీ, సృష్టి, ఝాన్సీ, కృష్ణుడుతో టీమ్స్‌ని ఫామ్ చేసుకున్నారు. అయితే వర్షిణిని రాంప్రసాద్‌  ముందుగా తన టీమ్‌లోకి తీసుకోలేదు. రోహిత్‌ తనకున్న ఆప్షన్‌తో ఆమెను రాంప్రసాద్‌ టీమ్‌లోకి పంపాడు. దీంతో వర్షిణి..రాంప్రసాద్‌ పై అలక పూనింది.  ‘నన్ను ఎందుకు పిక్‌ చేసుకోలేదు? నాకెందుకు బ్యాడ్జ్‌ ఇవ్వలేదు?’ అని అతన్ని నిలదీసింది.దీనికి రామ్‌ప్రసాద్‌ స్పందిస్తూ.. ‘రోహిత్‌ నిన్ను ఖచ్చితంగా తీసుకోడు అనే నమ్మకం ఉంది. అందుకే నిన్ను చివరి వరకు తీసుకోలేదు’ అని చెప్పాడు.

గ్రూప్‌ గేమ్‌పై వర్షిణి, చరణ్‌ మధ్య డిస్కషన్‌
ఇక వర్షిణి, ఆర్జే చరణ్‌ మధ్య గ్రూప్‌ గేమ్‌ అంశంపై చర్చ జరిగింది. ‘గ్రూప్‌’ అని అనడం తనకు నచ్చలేదని చరణ్‌ చెప్పగా.. ‘గ్రూప్‌గా ఆడుతున్నప్పుడు గ్రూప్‌ గేమ్‌ అనకపోతే ఏమంటాం?’ అంటూ వర్షిణి రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చింది.అంతేకాదు.. ‘మీరంతా కలిసే ఉంటున్నారు. కానీ మీతో ఝాన్సీ ఎందుకు కలవడం లేదు?’ అని చరణ్‌ను ప్రశ్నించింది. దీనికి చరణ్‌ తనకు అలా అనిపించడం లేదని చెప్పగా.. ‘నాకు కనిపిస్తుంది’ అంటూ వర్షిణి తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది.

రోహిత్‌ తోపులా ఫీలవుతున్నాడు
అనంతరం బిగ్‌బాస్‌ బ్లూ టీమ్‌ సభ్యులకు ఓ కీలక టాస్క్‌ ఇచ్చాడు. ఇంటిసభ్యులుగా ఉండేందుకు అనర్హులు అనిపించే ఒక్కొక్కరి పేరును చెప్పాలని సూచించాడు.ఈ సందర్భంగా వర్షిణి అనూహ్యంగా రోహిత్‌ పేరును చెప్పింది. అంతేకాదు.. అతని గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అగ్నిపరీక్షలో రోహిత్‌ను చూసినప్పుడు అతనితో మంచి వైబ్‌ ఉంటుందని అనుకున్నానని చెప్పింది. కానీ హౌస్‌లోకి వచ్చిన తర్వాత అతని యాటిట్యూడ్‌ పూర్తిగా మారిపోయిందని విమర్శించింది. రోహిత్‌ తనను తాను పెద్ద తోపులా ఫీల్‌ అవుతున్నాడని.. ‘నా అంతటోడు లేడు, నేనే పెద్ద దేవుడ్ని’ అన్నట్టుగా బిల్డప్‌ ఇస్తున్నాడని వ్యాఖ్యానించింది. అతను గేమ్‌లో ఓడిపోయినప్పటికీ.. తన తప్పును అంగీకరించకుండా ఎదుటి వ్యక్తిని బ్లేమ్‌ చేశాడని ఆరోపించింది. అంతేకాదు.. త్రిగుణ్‌  ‘గ్రూప్‌’ అని అనగానే రోహిత్‌ ట్రిగ్గర్‌ అయ్యాడని వర్షిణి చెప్పింది. ‘దొంగను దొంగ అంటే ఎంత కోపం వస్తుందో.. సార్‌గారిని గ్రూప్‌ అనగానే అంత కోపం వచ్చింది. అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చేలోపే రోహిత్‌ కళ్లు నెత్తికెక్కాయి. అది రియాలిటీ కాదు. అతనికి రియాలిటీ ఏంటో తెలియాలి. అతన్ని కిందకు దింపాలి’ అంటూ  కాస్త సీరియస్‌గానే మాట్లాడింది.

రోహిత్‌పై కృష్ణుడు ఫైర్‌..
ఆ తర్వాత నామినేషన్‌ బాధ్యత రెడ్‌ టీమ్‌కు వచ్చింది. బ్లూ టీమ్‌ సభ్యుల్లో హౌస్‌మేట్స్‌గా మారేందుకు ఎవరు అనర్హులో చెప్పే బాధ్యతను బిగ్‌బాస్‌ రోహిత్‌కు అప్పగించాడు.రోహిత్‌ వరుసగా కృష్ణుడు, రామ్‌ప్రసాద్‌, వర్షిణి, త్రిగుణ్‌, దేబ్జానిలను అనర్హులుగా ప్రకటించాడు. దీంతో కృష్ణుడు రోహిత్‌పై ఫైర్‌ అయ్యాడు. ‘కీ తనకు ఇచ్చారని కుళ్లుబోతుతనం.. సుపీరియారిటీ కాంప్లెక్స్‌’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అయితే రోహిత్‌ మాత్రం నవ్వుతూ నిలబడిపోయాడు. రామ్‌ప్రసాద్‌, వర్షిణి సైతం రోహిత్‌పై మండిపడ్డారు.

‘ప్రొటెక్టివ్‌ బాస్‌’ టాస్క్‌లో ఫౌల్‌ గేమ్‌
ఆ తర్వాత నామినేట్‌ అయిన పది మంది సభ్యులకు బిగ్‌బాస్‌ ‘ప్రొటెక్టివ్‌ బాస్‌’ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో డిఫెండర్లను కిల్‌ చేస్తూ బాస్‌ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. మొదటి రౌండ్‌లో బ్లూ టీమ్‌ అటాకర్స్‌గా, రెడ్‌ టీమ్‌ డిఫెండర్స్‌గా టాస్క్‌ ప్రారంభమైంది. ఈ క్రమంలో త్రిగుణ్‌ ఫౌల్‌ గేమ్‌ ఆడాడని రోహిత్‌ ఆరోపించాడు. మొత్తంగా చూస్తే బిగ్‌బాస్‌ 10 రెండో రోజు ఎపిసోడ్‌లో మాటల యుద్ధం మాత్రం బాగానే కనిపించింది. ముఖ్యంగా రోహిత్‌పై వర్షిణి చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. కృష్ణుడు కూడా ఊహించని విధంగా ఫైర్‌ అవుతూ కనిపించాడు.అయితే టాస్క్‌ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎపిసోడ్‌లో పెద్దగా పస లేదనిపించింది.

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)