Breaking News

బిగ్‌బాస్ 10: కెప్టెన్‌గా ముకేశ్.. వచ్చినరోజే జాక్ పాట్ కొట్టిన అపూర్వ

Published on Sat, 09/26/2026 - 08:21

బిగ్‌బాస్ అంటేనే గొడవలు, కొట్లాటలు. అవి లేకపోతే షోలో మజా ఉండదు. ఈ విషయం నిర్వహకులకు కూడా తెలుసు. అందుకే ఎక్కడ ఇలాంటివి వర్కౌట్ అవుతాయా అని చూస్తుంటారు. అగ్నిపరీక్షలో పాల్గొన్న అపూర్వ, మిథిలేష్‌లని హౌస్‌లోకి ప్రవేశపెట్టిన బిగ్‌బాస్.. సామాన్యుల మధ్య చిచ్చు పెట్టాడు. ఇంతకీ 19వ రోజైన శుక్రవారం(సెప్టెంబరు 25) అసలేం జరిగింది? అనేది ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం.

(ఇదీ చదవండి: తాత–నాన్నలా జేసన్‌ గొప్ప స్థాయికి వెళ్లాలి: చిరంజీవి)

ఇంట్లోని కంటెస్టెంట్స్ అందరూ వద్దనుకుని తక్కువ ఓట్లు వేసిన అపూర్వని బిగ్‌బాస్.. హౌస్‌లోకి తీసుకొచ్చి ట్విస్ట్ ఇచ్చాడు. నీకు, అపూర్వకు ఏదో ప్రాబ్లం ఉంది.. ఆమె రావడం నీకు ఇష్టం లేదని మాట్లాడుకుంటున్నారని షాలినీతో రోహిత్ అంటాడు. నేను మాట్లాడాను కానీ ఆమె మాట్లాడలేదు. అసలు ముఖేష్ అయితే ఆమె రావొద్దు అని కెమెరాల ముందుకు వెళ్లి అన్నాడు. ఇప్పుడేమో ఇలా ఉంటున్నాడు అని షాలినీ అంటుంది. ఇంతలో అక్కడొచ్చిన త్రిగుణ్.. నీకు, ఆమెకు ఏమైనా సమస్య ఉందా? అని అడిగితే.. నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు అని షాలినీ సమాధానమిచ్చింది. మరో వైపు నరేష్ నిద్రపోయాడని బిగ్‌బాస్ హెచ్చరించడంతో.. కెప్టెన్ ఝాన్సీ ఇతడితో గుంజీలు తీయించింది.

మిథిలేష్, రామకృష్ణకు సమానంగా ఓట్లు వచ్చాయని, అందుకే ఓ టాస్క్ ఇస్తున్నానని గెలిచిన వాళ్లికే ఇంట్లోకి ప్రవేశం ఉంటుందని బిగ్‌బాస్ చెప్పగా.. ఇచ్చిన టైర్ల టాస్క్‌లో గెలిచిన మిథిలేష్ ఇంట్లో అడుగుపెట్టాడు. ఇంటి పనుల విషయంలో త్రిగుణ్‌, అమన్‌ మధ్య చిన్న గొడవ జరిగింది. కెప్టెన్ చెప్తేనే వింటా నువ్వు చెప్తే ఎందుకు వింటా అని అమన్ అంటాడు. చిరాకేస్తుందని త్రిగుణ్ అనేసరికి గొడవ మరింత ముదురుతుంది. చివరకు త్రిగుణ్ వచ్చి అమర్‌కి సారీ చెప్పడంతో సద్దుమణిగింది.

ఇక హౌస్‌లోకి వచ్చిన అపూర్వ, మిథిలేష్‌కు ఓ పవర్ ఇచ్చిన బిగ్‌బాస్.. కెప్టెన్సీ కంటెండర్లలో నుంచి ఇద్దరిని తీసేయాలని, దానికి తగిన కారణాలు చెప్పాలని అంటాడు. దీంతో మిథిలేష్.. ఝాన్సీ పేరు చెప్తాడు. శ్రష్టిని తీసేయాలని అపూర్వ ముందే ఫిక్స్ అవుతుంది. ఆమెకు సహనం లేదు. ఆ రోజు సుధీర్‌ని ఇష్టమొచ్చినట్టుగా తిట్టింది. చెత్త వేసి కొట్టిందని.. అపూర్వ, మిథిలేష్ తమ కారణాలు చెప్తారు. మరోవైపు అమన్ గురించి మాట్లాడుతూ.. అనవసరంగా ఫైర్ అయ్యాడు. స్క్రీన్ స్పేస్ కోసం చేసినట్టు అనిపించింది, కన్ఫ్యూజ్ అవుతాడు అని మిథిలేష్, అపూర్వ చెప్పారు. దీంతో కామరన్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. చూస్తుంటే సెలబ్రిటీల కంటే అగ్నిపరీక్ష నుంచి వచ్చిన సామాన్యుల మధ్య పుల్లలు పెట్టాలని బిగ్‌బాస్ ఫిక్స్ అయినట్లు ఉన్నాడనిపించింది.

చివరగా అపూర్వ, ముఖేష్ ఒక జట్టుగా.. ఝాన్సీ, మిథిలేష్ మరో జంటగా ఓ గేమ్ ఆడతారు. ఈ టాస్క్‌లో అపూర్వ, ముఖేష్ గెలవగా.. ముఖేష్‌కి కెప్టెన్సీ బాధ్యతలు దక్కగా.. అపూర్వకి ఇమ్యూనిటీ ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ఇంట్లోకి అడుగుపెట్టిన రోజే అపూర్వ జాక్‌పాట్ కొట్టినట్లయింది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: చిరంజీవి అన్నీ చూస్తున్నారు.. కానీ ఇలా మాట్లాడుతారనుకోలేదు)

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)