ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...
ధురంధర్ 2 ఎఫెక్ట్.. స్టార్ హీరో సినిమా వాయిదా
Published on Wed, 03/25/2026 - 13:30
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘భూత్ బంగ్లా’ విడుదల మరోసారి వాయిదా పడనుంది. ఈమేరకు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. అక్షయ్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా ‘భూత్ బంగ్లా’. ఇందులో టబు, వామికా గబ్బి, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి.

రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. దీంతో ఏప్రిల్ 10న భూత్ బంగ్లా విడుదల కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం మరో వారం పాటు వాయిదా పడి, ఏప్రిల్ 17, 2026న కొత్త విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. 'ధురందర్: ది రివెంజ్' భారీ విజయం సాధించి, బాక్సాఫీస్‌ను శాసిస్తూ ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.
Tags : 1