Breaking News

OTT: ఓటీటీలో భయపెడుతూ నవ్విస్తున్న సినిమా!

Published on Tue, 01/07/2025 - 17:52

సాధారణంగా సినిమాలలో ఓ రెండిటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకటి హ్యుమర్ అయితే మరోటి హారర్. కాని ఆ రెండూ కలిపి సినిమా తీస్తే అదే ఈ సినిమా భూల్ భులయ్యా3. ఇది భూల్ భులయ్యా(Bhool Bhulaiyaa 3) సిరీస్ లో వచ్చిన మూడవ సినిమా. నిజానికి మొదటి భాగానికి మిగతా రెండు భాగాలకి కథతో పాటు పాత్రధారులలో కూడా తేడా ఉంది. భూల్ భులయ్యా మొదటి భాగం చంద్రముఖి సినిమా ఆధారంగా తీసింది. కాని మిగతా రెండు భాగాలు మాత్రం అదే థీమ్ తో కాస్త విభిన్నంగా రూపొందించారు. ఇప్పుడు భూల్ భులయ్యా 3(Bhool Bhulaiyaa-3) సినిమా కథ విషయానికొస్తే 200 సంవత్సరాల క్రితం రక్తఘాట్ రాజ్యంలో జరిగిన కథ. అప్పటి రాజ కుటుంబం వల్ల జరిగిన సంఘటనలో మంజులిక అనే ఓ దెయ్యం తయారవుతుంది. 

ఈ దేయ్యాన్ని అదే రాజ్యంలోని అంతఃపుర గదిలో భద్రంగా భద్రపరుస్తారు ఆ రాజ్యానికి చెందిన రాజగురువు. 2024 సంవత్సరంలో వారసత్వ సంపదగా ఆ అంతఃపురాన్ని ఓ హోటల్ గా మార్చాలని  రాజకుటుంబం వారసులు ప్రయత్నించగా బందీగా ఉన్న మంజులిక దెయ్యం బయటపడి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ విషయం చూసే ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిస్తాయి. 

మరి ఈ మంజులికను కట్టడి చేయడానికి ఫేక్ మాంత్రికుడైన రూహాన్ ను ఆ రాజ్యానికి తెప్పించుకుంటారు. రూహాన్ రక్తఘాట్ కు వచ్చినప్పటి నుండి కథ అనేక మలుపులు తిరగుతూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ తో ముగుస్తుంది. ఈ సినిమా లో ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. అందులో మొదటగా హీరో రోల్ వేసిన రోహాన్. తన ఈజ్ ఆఫ్ యాక్టింగ్ తో హారర్ ఎమోషన్ ని కూడా హ్యుమర్ ఎమోషన్ తో చక్కగా నటించాడు. 

ఇక విశేష పాత్రలలో నటించిన నాటి తార మాధురీ దీక్షిత్, నేటి వర్ధమాన తార విద్యాబాలన్ వారి నటనతోనే కాదు అద్భుత నాట్యంతో కూడా సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. దర్శకుడు అనీస్ ఈ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా ఓ పక్క భయపెడుతూ మరో పక్క గిలిగింతలు పెడుతూ ప్రేక్షకులను కదలినివ్వకుండా స్క్రీన్ ప్లే నడిపాడు. నెట్ ఫ్లిక్స్ ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతున్నఈ భూల్ భులయ్యా వీకెండ్ వాచబుల్ మువీ.
 - ఇంటూరు హరికృష్ణ.

Videos

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)