Breaking News

ఓటీటీ 'మహాశయులకు విజ్ఞప్తి'.. ఆలస్యానికి కారణం ఇదేనా?

Published on Sat, 02/21/2026 - 12:03

ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాలన్నీ కూడా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. ది రాజాసాబ్‌ (జియోహాట్‌స్టార్‌), మన శంకర వరప్రసాద్‌గారు (జీ5), నారీ నారీ నడుమ మురారి (అమెజాన్‌), అనగనగా ఒకరాజు (నెట్‌ఫ్లిక్స్‌)లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి, అయితే, రవితేజ నటించిన  భర్త మహాశయులకు విజ్ఞప్తి( Bhartha Mahasayulaku Wignyapthi) మూవీ మాత్రం ఓటీటీ విడుదల విషయంలో జాప్యం ఏర్పడుతుంది. ఈ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. కానీ, స్ట్రీమింగ్‌ వివరాలను అధికారికంగా ప్రకటించకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అయితే, ఓటీటీ ఆలస్యానికి కారణాలు  ఏంటి అనేది సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ థియేటర్ రన్‌ తర్వాత స్ట్రీమింగ్ హక్కులను ZEE5 పొందింది. అయితే, ఈ మూవీ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై మౌనం పాటిస్తోంది.  ఇది ప్రేక్షకులకు అంతగా నచ్చడం లేదు. డిజిటల్ ప్రీమియర్ ఆలస్యం వెనుక ఉన్న  కారణాన్ని పేర్కొంటూ తాజాగా ఆన్‌లైన్‌లో ఒక ఆసక్తికరమైన రూమర్‌ వైరల్‌ అవుతుంది. దీని ప్రకారం, ఇతర భాషాలకు సంబంధించిన డబ్బింగ్‌ వెర్షన్‌ పనులు పూర్తి కాలేదట. ముందుగా మేకర్స్‌ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటోందని, అందుకే OTT అరంగేట్రం చేసేందుకు మరింత సమయం తీసుకుంటుందని తెలుస్తోంది.

ZEE5 సాధారణంగా బహుళ భాషలలో ప్రముఖ చిత్రాలను ఒకేసారి విడుదల చేస్తుంది. ఇటీవల, చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు ఏడు భాషలలో విడుదలైన విషయం తెలిసిందే. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ మూవీలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటించారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీ మంచి టాక్‌ తెచ్చుకుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)