Breaking News

ఇండియాలోనే తొలిసారిగా స్క్రిప్ట్‌ బ్యాంక్‌.. లాంచ్‌ చేసిన భారతీరాజా

Published on Sun, 02/12/2023 - 10:06

తమిళసినిమా: సాధారణంగా డబ్బులు పొదుపు చేసుకోవడానికి, అవసరమైనప్పుడు వాడుకోవడానికి బ్యాంకులను ఉపయోగిస్తుంటాం. అలాంటిది ఇప్పుడు సినిమా దర్శక నిర్మాతల కోసం ఒక కథల బ్యాంకు ప్రారంభమైంది. స్క్రిప్ట్‌ టిక్‌ పేరుతో గీత రచయిత మదన్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ ధనుంజయన్‌ కలిసి నెలకొల్పారు. ఈ బ్యాంకును ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా శనివారం ఉదయం ప్రారంభించారు. ప్రతిభావంతులైన రచయితల కథనాలను చదివి వాటిలో మంచి కథలను ఎంపిక చేసి చిత్ర నిర్మాణానికి సిద్ధం చేసి దర్శక నిర్మాతలకు అందించే విధంగా ఏర్పాటు చేసిన కొత్త ప్రయత్నమే ఈ బ్యాంక్‌ అని వెల్లడించారు.

ప్రస్తుతం వస్తున్న చాలా చిత్రాల్లో కథ, కథనాలు సరిగ్గా ఉండడం లేదన్నారు. అందుకే చాలా వరకు చిత్రాలు ఫ్లాప్‌ అవుతున్నాయన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకునే ప్రతిభావంతులైన కథా రచయితలు, దర్శకులు, నిపుణులు అందించిన కథలతో చిత్రాలు చేస్తే కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతారని అన్నారు. అలాంటి ప్రయత్నంతోనే ఈ బ్యాంకును ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

పలువురు ప్రతిభావంతులైన రచయితలను ప్రోత్సహించడం, వారికి తగిన పారితోషికాన్ని అందించడం తమ లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు. నిర్మాతలు పలు కథలను విని వాటిలో ఒకటి, రెండు ఎంపిక చేసుకోవడం కాకుండా మంచి కథ మాత్రమే చదివి చిత్రాలు చేయడం వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. అదే విధంగా తక్కువ సమయంలో పలు చిత్రాలు నిర్మించే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి మంచి కథలను అందించడమే తమ స్క్రిప్ట్‌ టిక్‌ బ్యాంకు ఉద్దేశమని పేర్కొన్నారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)