Breaking News

ఓటీటీలో భారతీయుడు 2.. అంచనాలు తప్పడంతో మార్పులు

Published on Mon, 07/22/2024 - 11:31

కమల్‌ హాసన్‌ - శంకర్‌ కాంబినేషన్‌లో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.  1996లో విడుదలైన భారతీయుడు సూపర్‌ హిట్‌ దక్కించుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్‌ 2  జులై 12న  విడుదలైంది. అయితే, సినిమా భారీ డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. భారతీయుడు 2 సినిమాలో కమల్‌ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు.

భారతీయుడు 2 సినిమాను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. కోలీవుడ్‌లో అత్యంత ఎక్కువ ధరతో ఈ సినిమా రైట్స్‌ను వారు తీసుకున్నట్లు సమాచారం. విడుదల సమయం నుంచి సుమారు 2 నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకురావలనే షరతుతో నెట్‌ఫ్లిక్స్‌ అగ్రిమెంట్‌ చేసుకుందట. వారి ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్‌ 12 తర్వాత ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. కానీ, సినిమా రిలీజ్‌ తర్వాత సీన్‌ మారిపోయింది. భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఇప్పటి వరకు కనీసం రూ.70 కోట్లు కూడా దాటలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో నిర్మాతలకు కూడా తీరని నష్టాన్ని ఇండియన్‌ 2 సినిమా మిగిల్చిందనే చెప్పవచ్చు.

భారతీయుడు 2 చిత్రాన్ని ఇప్పటికే చాలాచోట్ల తొలగించేశారు. ఓటీటీలో చూడొచ్చని ప్రేక్షకులు కూడా డిసైడ్‌ అయిపోయారు. దీంతో ఈ చిత్రాన్ని అగ్రిమెంట్‌ ప్రకారం కాకుండా నెలలోపే ఓటీటీలోకి తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్‌ చేస్తుందట. ఆగష్టు 2న భారతీయుడు 2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు నెట్‌ఫ్లిక్స్‌ మంతనాలు జరుపుతుందట. ఈమేరకు అధికారికంగా త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)