Breaking News

భారతీయుడు 2 చిత్రానికి ఓటీటీ చిక్కులు

Published on Thu, 08/01/2024 - 16:00

కమల్‌ హాసన్‌ - శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు 2 సినిమాకు ఓటీటీ చిక్కులు ఎదురుకానున్నాయని తెలుస్తోంది. జులై 12న  విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణమైన డిజాస్టర్‌గా మిగిలిపోయింది. సినిమాలో డైరెక్టర్‌ శంకర్‌ మార్క్‌ ఎక్కడా కనిపించకపోవడంతో ప్రేక్షకులు కూడా పెద్దగా ఆదరించలేదు. సినిమాపై ఆశలు పెట్టుకుని భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పుడు పునరాలోచనలో పడింది. దీంతో భారతీయుడు 2 ఓటీటీ విషయంలో సందిగ్ధత నెలకొనే అవకాశాలు ఉన్నాయి.

1996లో విడుదలైన భారతీయుడు సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌గా పార్ట్‌ 2 వచ్చింది. ఇందులో   కమల్‌ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు. సినిమా విడుదలకు ముందు భారీ బజ్‌ క్రియేట్‌ కావడంతో భారతీయుడు 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్  సుమారు రూ.120 కోట్లకు డీల్‌ సెట్‌ చేసుకుందని సమాచారం. అయితే, సినిమా విడుదలయ్యాక పరిస్థితి మారిపోయింది. దీంతో డీల్‌ ప్రకారం ఉన్న అంత మొత్తం చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ముందుకు రావడం లేదట. ఈమేరకు  లైకా ప్రొడక్షన్స్‌తో మళ్లీ చర్చలు జరిపి రూ. 60 కోట్లకు ఫైనల్‌ చేయాలని కోరిందట. 

ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో భారతీయుడు ఓటీటీలో వచ్చేందుకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో రజనీకాంత్ 'లాల్ సలామ్',  టైగర్ ష్రాఫ్  'గణపత్' కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఇలాంటి అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. భారతీయుడు 2 కోసం సుమారు రూ. 250 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా.. అయితే, ఈ సినిమా రూ. 120 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్‌ రాబట్టినట్లు సమాచారం.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)