Breaking News

ఆర్మీ నేపథ్యంలో...

Published on Mon, 01/27/2025 - 03:32

భరత్‌ చౌదరి, ప్రియాంక నాంది జంటగా జె. మోహన్ కాంత్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిషన్  007’. మహంకాళీ పిక్చర్స్‌ పతాకంపై మహంకాళీ నాగ మహేశ్‌ నిర్మించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌లో మోహన్ కాంత్‌ మాట్లాడుతూ–‘‘యాక్షన్  ఎంటర్‌ టైనర్‌గా రూపొందిన చిత్రం ‘మిషన్  007’. మా నిర్మాత నాగమహేశ్‌గారికి ఇది తొలి సినిమా. బడ్జెట్‌ చెప్పిన దానికన్నా ఎక్కువ అయినా ఎక్కడా రాజీ పడలేదు.. అందరికీ నచ్చే మూవీ ఇది’’ అన్నారు. నాగమహేశ్‌ మాట్లాడుతూ– ‘‘యూనిట్‌ మొత్తం తమ సొంత సినిమాలా భావించి పనిచేశారు.

మా చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేస్తుంది. మాకు అన్ని విధాలా సహకరించిన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని చెప్పారు. ‘‘మోహన్ గారు కథ చెప్పినప్పుడు ఆర్మీ నేపథ్యం అనగానే భయం వేసింది. కానీ, ఆయన నమ్మకం చూసి ధైర్యంగా నటించాను’’ అన్నారు భరత్‌ చౌదరి. ‘‘వాణిజ్య అంశాలతో పాటు దేశభక్తి కూడా ఉండటం మా సినిమాకు గర్వకారణం. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు ప్రియాంక నాంది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)