Breaking News

విలన్‌గా భరణి.. తనూజ కోసం శ్రీజ బలి

Published on Tue, 10/07/2025 - 08:40

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 5వ వారం నామినేషన్స్ కార్యక్రమం పూర్తి అయింది. అయితే,  కెప్టెన్ రాము రాథోడ్ మినహా అందరినీ నామినేషన్స్‌లోకి బిగ్‌బాస్‌ తీసుకెళ్లాడు. కానీ, మళ్లీ వారికి ఒక ట్విస్ట్‌ ఇచ్చాడు. నామినేషన్స్‌ నుంచి తప్పించుకునేందుకు ఇమ్యూనిటీ టాస్క్‌ ఇవ్వడంతో అందరూ గందరగోళంలో పడ్డారు. ఫైనల్‌గా ఇమ్మాన్యుయేల్‌ (Emmanuel) టాస్క్‌లో గెలిచి ఇమ్యూనిటీని సాధించుకున్నాడు.

బిగ్‌బాస్ రణరంగంలో భాగంగా కంటెస్టెంట్స్‌ అందరినీ గార్డెన్‌ ఏరియాలోకి పిలిపించారు.   ఇమ్యూనిటీ కోసం మీరు చేస్తున్న యుద్ధంలో గెలవాలంటే నామినేట్ అయిన సభ్యులందరూ బెడ్‌పైకి ఎక్కి మిగిలిన సభ్యుల్ని ఒక్కొక్కరినీ బెడ్ నుంచి కిందకి దింపాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ బెడ్‌పై ఎక్కువ సమయం ఉంటారో వారు ఇమ్యూనిటీకి అంత చేరువ అవుతారని చెప్తారు. ఈ గేమ్‌లో బలమైన కంటెస్టెంట్స్‌ డీమాన్, కళ్యాణ్, ఇమ్మూ, భరణి ఒక టీమ్‌గా అయిపోయి.. వారి ప్రయారటీ ప్రకారం వరుసుగా బెడ్‌పై నుంచి కిందకు తోసేస్తారు.  మొదటి రౌండ్‌లో సంజన, తర్వాతి రౌండ్‌లో సుమన్ శెట్టిని టార్గెట్ చేశారు. ఆ తర్వాత దివ్య,డీమాన్,  శ్రీజ ఆట నుంచి విరమిస్తారు.

శ్రీజను బలంగా నెట్టేసిన భరణి
చివరి రౌండ్‌లో భరణి,  శ్రీజ, తనూజ, కళ్యాణ్, ఇమ్మూ,  మాత్రమే ఉన్నారు. వీరిలో ఒక్కరిని మాత్రమే కిందకు తోసేయాలి. అయితే, గతంలో ఒకసారి తనూజకి ఇమ్యూనిటీ వచ్చిందని తనని తోసేద్దామని శ్రీజ సలహా ఇచ్చింది.  ఆ మాటలకు కళ్యాణ్‌తో పాటు ఇమ్మూ కూడా సపోర్ట్ చేస్తాడు. కానీ, భరణి, తనూజకి సపోర్ట్ చేయాలనుకుంటాడు. ఇలా వారందరూ చర్చలు చేస్తున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా  భరణి ఒక్కడే శ్రీజని బలంగా కిందకి తోసేశాడు. ఈ క్రమంలో శ్రీజకి  గాయం కూడా అయింది. దీంతో శ్రీజను ఓదార్చేందుకు భరణి వెళ్తాడు. ఇలా మంచితనంగా నటించకండి అన్నా అంటూ భరణిపై శ్రీజ పైర్‌ అవుతుంది. చర్చలు జరుపుతున్న సమయంలో ఇలా తోసేయడం ఏంటి అంటూ సీరియస్‌ అయింది. మంచోడిలా నటించకండి. నీలా మంచిదానిలా నటించడం నాకు రాదన్నా.. అంటూ  బాధ పడుతుంది. రేలంగి మావయ్యలా నటిస్తున్నావంటూ భరణిని శ్రీజ దుమ్ములేపింది. ఇక్కడ గెలిచిన భరణి,   తనూజ, కళ్యాణ్, ఇమ్మూలకు  గాలి- నిప్పు- నీరు టాస్క్‌ను బిగ్‌బాస​ ఇస్తాడు. ఇందులో విజేతగా ఇమ్మాన్యుయేల్‌ నిలుస్తాడు.

కన్నీళ్లు పెట్టుకున్న దివ్య
ఈ టాస్క్‌లో అమ్మాయిల నుంచి ఎక్కువగా పోరాడింది దివ్య మాత్రమే...  నమ్మిన భరణి కూడా తనకు సాయం చేయకపోవడంతో ఆమె బాధ పడింది. భరిణి ఎక్కువగా తనూజకు మాత్రమే అండగా నిలబడటం దివ్య సహించలేకపోయింది. బెడ్‌ మీద నుంచి తనను తోసేస్తున్నా కూడా భరణి  అడ్డు పడలేదు. ఆపై అమ్మాయిలు ఎవరూ కూడా ఆమె కోసం నిలబడలేదు. దీంతో దివ్య కన్నీళ్లు పెట్టుకుంది.

విలన్‌గా భరణి..
బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లో చివర రౌండ్‌ జరుగుతున్న సమయంలో మాటల్లో పెట్టి శ్రీజను భరణి తోసేశారు. ఈ విషయంలో ఆయనపై విమర్శలు వచ్చాయి. గతంలో తనూజకు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఆమె కిందకు పంపితే బాగుంటుందని శ్రీజ  చెబుతుంది. అందరూ శ్రీజ కరెక్ట్‌ అంటున్న సమయంలో తనూజ కోసం భరణి చేసిన పని ఎంత మాత్రం కరెక్ట్‌ కాదని ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది. ఈ టాస్క్‌లో దివ్య తర్వాత ఎక్కువగా గేమ్‌ ఆడింది కూడా శ్రీజానే.. కానీ, తనూజ మాత్రం కనీసం ఆటలో భాగం కాకుండా అలా ఉండిపోయింది. ఆమెను సేవ్‌ చేసి శ్రీజను తొలగించడం ఎవరికీ నచ్చలేదు. గతంలో సుమన్‌కు ఇమ్యూనిటీ వచ్చిందనే కదా కిందకు తోసేశారు.. మరి తనూజాను ఎందుకు తోయలేదంటూ భరణిని ప్రశ్నిస్తుంది. ఇలా బుల్లెట​్‌ లాంటి ప్రశ్నలతో శ్రీజ దుమ్ములేపుతుంది. రేలంగి మామయ్య రూపంలో ఉన్న విలన్‌ భరణి అంటూ విమర్శలు వస్తున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)