Breaking News

అమ్మ నా వాట్సాప్‌ను బ్లాక్‌ చేసింది..!: భాగ్యశ్రీ

Published on Fri, 07/31/2026 - 08:35

ఒకప్పుడు యువతులు సినిమా రంగంలోకి రావడానికి భయపడేవారు. వారి కుటుంబ సభ్యులకు కూడా అనుమతించే వారు కాదు. అయితే ఆ పరిస్థితి రాను రాను పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అన్ని వర్గాలకు చెందిన మహిళలు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే చిత్ర పరిశ్రమ గురించి సదాప్రాయం లేని వారు ఉన్నారంటే అది ఆశ్చర్యమే. నటి భాగ్యశ్రీ బోర్సే కుటుంబం ఈ కోవకు చెందినదే. తెలుగు చిత్రం మిస్టర్‌ బచ్చన్‌ తో  సినీ రంగ ప్రవేశం చేసిన నటి ఈ బ్యూటీ. ఆ తరువాత  కింగ్‌ డామ్‌ చిత్రం ( అనువాదం) తో కోలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు ఆ తర్వాత దుల్కర్‌ సల్మాన్‌ కు జంటగా నటించిన కాంత చిత్రం కూడా నిరాశపరిచింది.

 అయితే ఆ చిత్రంలో నటి భాగ్యశ్రీ బోర్సే నటన అందర్నీ ఆకట్టుకుంది. ఏదేమైనా చిత్రాలు సక్సెస్‌ అయితేనే అందులో నటించిన హీరో హీరోయిన్లకు నేమ్‌ ఫేమ్‌ వస్తుంది. అలా ఐరన్‌ లెగ్‌ నటిగా ముద్ర వేసుకున్న ఈ అమ్మడు ఇటీవల తెలుగులో నటించిన లెనిన్‌ చిత్రం సక్సెస్‌ తో ఆ ముద్రను చెరిపేసుకున్నారు. అయితే ఈమెకు  క్రేజీ అవకాశాలు మాత్రం తలుపు తడుతూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం నటుడు శివకార్తికేయన్‌ కు జంటగా సెయోన్‌ చిత్రంలో నటిస్తున్నారు. 

కాగా నటి భాగ్యశ్రీ బోర్సే తన సినీ రంగ ప్రవేశం గురించి ఇటీవల ఒక భేటీల పేర్కొంటూ ‘‘తను సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నప్పుడు మా కుటుంబంలో ఒక్కరు కూడా సమ్మతించలేదు. ముందుగా నా  నిర్ణయాన్ని మా అమ్మకు చెప్పాను. ఆమె ససిమేరా వద్దు అని చెప్పారు. నాన్నను అడిగాను. ఆయన అమ్మ వద్దంటుంది కదా అని చెప్పారు. నాకు సోదరి అయిన సపోర్ట్‌ చేస్తుందని భావించాను. తను కూడా పూర్తిగా వ్యతిరేకించింది. సినిమా రంగం తమ కూతురికి సురక్షితం కాదు అన్నది వారి నిరాకరణకు కారణం. అయినా నా కలను నెరవేర్చుకోవడానికి సినిమాలో నటించడానికే ముందడుగు వేశాను. నేను మొదటిసారిగా అడిషన్‌ కు వెళ్లినప్పుడు మా అమ్మ  కోపంతో నా వాట్సాప్‌ ను బ్లాక్‌ చేసింది. 

అంతేకాకుండా ఆ తర్వాత ఆరు నెలలు ఆమె నాతో మాట్లాడలేదు. అయినా నేను నటిగా ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు వారు నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారులే అనే నమ్మకంతో సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యాను. కాగా జీవితంలో ఎవరికి సంశయభావం ఉండకూడదు. ఏం చేయాలని అనిపిస్తుందో అది చేయండి’’ అని నటి భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)