Breaking News

అందులో రొమాంటిక్‌ యాంగిల్‌ మాత్రమే చూశారు: భాగ్యశ్రీ బోర్సే

Published on Sun, 05/25/2025 - 09:28

ఒకే ఒక్క తెలుగు సినిమాతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్న నటి భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse). ఆ పాపులారిటీతోనే ఇప్పుడు చేతినిండా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోంది. ఆ విషయాలే మీ కోసం.. నైజీరియాలోని లాగోస్‌లో భాగ్యశ్రీ బోర్సే చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి ఆమె బిజినెస్ మేనేజ్మెంట్‌లో డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే మోడలింగ్ కెరీర్‌గా ఎంచుకుని ఒక ఎజెన్సీతో కలసిపనిచేసింది. పలు వ్యాపార బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించింది. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్‌తో ఆమె ప్రసిద్ధిచెందింది.

విజయ్‌ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘కింగ్‌డమ్‌’ సినిమాలో నుంచి విడుదలైన ‘హృదయం లోపల’ సాంగ్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. ఇందులో ఆమె చాలా ఇంటిమేట్‌గా కనిపించింది. ఈ విషయమై ఆమెను అడగ్గా, ‘క్యారెక్టర్‌కి నూటికి నూరు శాతం న్యాయం చేయడానికే అలా నటించా– స్టార్‌డమ్‌ అందుకోవడానికి కాదు. ఇందులోని హీరోయిన్‌ పాత్రలో కేవలం రొమాంటిక్‌ యాంగిలే కాదు, యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉన్నాయి. అందుకే, ఈ సినిమా కోసం నేను కూడా ఒక కామన్‌ ఆడియన్స్‌లాగా ఎదురు చూస్తున్నాను.’ అని భాగ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

రీసెంట్‌గా 26వ పుట్టినరోజు జరుపుకున్న భాగ్యశ్రీ.. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో జన్మించింది. భాగ్యశ్రీకి ఇద్దరు సిస్టర్స్‌ ఉన్నారు. ముగ్గురు ఆడపిల్లల్లో భాగ్యశ్రీ రెండవది. మిగిలిన ఇద్దరి పేర్లు మధువంతి, పూర్ణిమ. మొదటి సినిమాకి (మిస్టర్ బచ్చన్) రూ. 30 లక్షల పారితోషికం తీసుకున్న భాగ్యశ్రీ, ప్రస్తుతం రూ. రెండు కోట్లు డిమాండ్‌ చేస్తోందని సమాచారం.

ఏ ఫుడ్‌ ఇష్టం: హైదరాబాద్‌లో స్ట్రీట్‌ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బేగం బజార్‌లో దొరికే పానీ పూరీ, చాట్‌ అంటే ప్రాణం. అవకాశం దొరికినప్పుడు తనే స్వయంగా వెళ్లి తినడానికి ప్రయత్నిస్తుంది.

ఏ సినిమాలు చేస్తుంది: రామ్‌ పోతినేనితో ఓ సినిమా, దుల్కర్‌ సల్మాన్‌తో ఓ సినిమా చేస్తోంది భాగ్యశ్రీ. ‘కింగ్‌డమ్‌’ సినిమా రిలీజ్‌ తర్వాతే కొత్త ప్రాజెక్టులు సైన్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చిన ప్రతి సినిమాకు సైన్‌ చేయకుండా, ది బెస్ట్‌ అనిపించుకునే ప్రాజెక్టులకు మాత్రమే సైన్‌ చేస్తానంటోంది భాగ్యశ్రీ.

బాలీవుడ్‌ ఆలోచనపై:    కెరీర్‌ ఆరంభంలో హిందీలో ‘ఆరియాన్‌’, ‘చందు ఛాంపియన్‌’ అనే రెండు సినిమాలు చేసింది. కానీ, ఆ రెండూ నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతానికి బాలీవుడ్‌ గురించి ఆలోచించడం లేదంది.

వెజిటేరియనే కానీ,..: బేసిక్‌గా వెజిటేరియన్‌ అయినా, ప్రొటీన్‌ కోసం చికెన్‌ తినడం అలవాటు చేసుకున్నట్లు చెప్పింది. రొమాంటిక్‌ సినిమాలు చూడటం చాలా ఇష్టమట. ఏ పని అయినా వందశాతం చేయగలను అనే నమ్మకం ఉంటేనే, ఆ పనిని టేకప్‌ చేస్తాను. లేకపోతే నో చెప్పేస్తా’ అని చెప్పింది భాగ్యశ్రీ.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)