Breaking News

'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్‌లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?

Published on Wed, 06/28/2023 - 07:02

ప్రేక్షకుల్ని భయపెట్టడం అంత తేలికైన విషయమేం కాదు. వందల సినిమాల చూసేసుంటారు కాబట్టి సినిమాని కాస్త డిఫరెంట్ గా తీయాలి. అప్పుడే షాకవుతారు. ఆ చిత్రాన్ని హిట్ చేస్తారు. అలా ఈ ఏడాది సక్సెస్ కొట్టిన చిత్రం 'విరూపాక్ష'. రూ.100 కోట్ల వసూళ్లు కూడా సాధించిన ఈ మూవీ.. ఓటీటీలోనూ సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే దర్శకుడిని అందరూ మెచ్చుకున్నారు. మూవీ టీమ్ మాత్రం ఖరీదైన బెంజ్ కారుని బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది.

(ఇదీ చదవండి: జెట్ స్పీడ్‌లో శ్రీలీల కెరీర్.. ఆ అంశాలే కలిసొచ్చాయా?)

'విరూపాక్ష' సంగతేంటి?
గతంలో తెలుగులో పూర్తిస్థాయి హారర్ సినిమాలు వచ్చేవి కానీ ఆ తర్వాత తర్వాత అవి కాస్త హారర్ కామెడీ చిత్రాలుగా మారిపోయాయి. అలాంటిది 'విరూపాక్ష'ని చేతబడి కాన్సెప్ట్ తో కేవలం హారర్ కథతో అద్భుతంగా తీశాడు యంగ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ. స్క్రీన్ ప్లే విషయంలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ సహాయం చేసినప్పటికీ ఓవరాల్ క్రెడిట్ మాత్రం దర్శకుడికే దక్కుతుంది. దాన్ని ఏ మాత‍్రం మరిచిపోని నిర్మాతలు ఇప్పుడు కారుని గిఫ్ట్ గా ఇచ్చారు.

బెంజ్ బహుమతిగా
తనకు బెంజ్ కారుని గిఫ్ట్ గా ఇచ్చారని చెబుతూ దర్శకుడు కార్తీక్ వర్మ ట్విట్టర్ లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశాడు. వీటిలో బెంజ్ కారు సీ క్లాస్ మోడల్ కనిపించింది. మన దేశంలో దీని రోడ్ ప్రైస్ దాదాపు రూ.65-70 లక్షల వరకు ఉంటుంది. ఇలా హిట్ ఇచ‍్చిన దర్శకుడికి నిర్మాతలు కారుని బహుమతిగా ఇవ్వడం గతంలోనూ చాలాసార్లే జరిగింది. ఇప్పుడు 'విరూపాక్ష' దర్శకుడి విషయంలో మరోసారి నిజమైంది. ఇదంతా చూస్తే ప్రేక్షకుల్ని భయపెట్టాడు, ఖరీదైన కారుని పట్టేశాడు అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ట్రైలర్ బాగుంది కానీ ఆ బూతు డైలాగ్ ఎందుకు పెట్టారో?)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)