Breaking News

కొచ్చాడియాన్‌ కేసులో లతా రజనీకాంత్ పిటిషన్‌ కొట్టివేత

Published on Thu, 10/16/2025 - 13:55

తమిళ స్టార్ హీరో రజినీకాంత్‌ సతీమణి లతా రజినీకాంత్‌పై చీటింగ్‌ కేసు ఉన్న విషయం తెలిసిందే. 2015లో తమ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించిన కొచ్చాడియాన్‌ సినిమా ప్రొడక్షన్ టైంలో ఓ యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి  తీసుకున్న ఋణం తిరిగి ఇవ్వకపోవడంతో లతా రజినీకాంత్పై చీటింగ్ కేసు నమోదైంది. ఆమె ష్యూరిటీ సంతకం పెట్టడం వల్లే ఈ చిక్కులు వచ్చాయని సమాచారం. అయితే, ఈ కేసులో ఆమెకు బెయిల్‌ లభించింది. కానీ, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదంటూ బెంగళూరు కోర్టులో లత పిటిషన్‌ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం దానిని తిరస్కరించింది.

2014లో విడుదలైన 'కొచ్చాడియాన్‌' చిత్రానికి సంబంధించిన ఫోర్జరీ కేసులో తన పేరును తొలగించాలని  కోరుతూ  లత రజనీకాంత్  చేసిన దరఖాస్తును బెంగళూరు కోర్టు కొట్టివేసింది. తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె పేర్కొంది. అయితే,  48వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్  నిందితులపై విచారణ జరిపేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆమె దరఖాస్తును కొట్టివేశారు.

2015లో, చెన్నైకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో  లత నకిలీ పత్రాలను ఉపయోగించి కోర్టును కూడా మోసం చేశారని ఒకరు పిటిషన్‌ వేశారు. తప్పుడు పత్రాలతో ఆమె మీడియా గ్యాగ్ ఆర్డర్‌ పొందారని పిటిషన్‌ దాఖలైంది. ఈ ఆర్డర్‌తో   ఆమెపై వచ్చిన పలు మీడియా కథనాలు తొలగించారని అందులో పేర్కొన్నారు.   కొచ్చాడియాన్‌తో  సంబంధం ఉన్న ఆర్థిక వివాదాలకు సంబంధించిన దాదాపు 70 మీడియా సంస్థలకు చెందిన వార్తలు తొలగించారని తెలిపారు.

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)