Breaking News

అంత వైరల్‌ చేశారేంటి? నేనేదో సరదాగా అన్నా!: హీరో

Published on Thu, 09/11/2025 - 09:58

హారర్, మిస్టరీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించారు. సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పంచుకున్న విశేషాలు. 

నాకు ఇష్టమైన జానర్‌
👻 టీనేజ్‌లో ఉన్నప్పట్నుంచి నాకు హారర్‌ సినిమాలంటే ఇష్టం. మా శ్రీ సాయి గణేశ్‌ ప్రొడక్షన్‌లో నిర్మించిన ‘కాంచన’ సినిమాని చాలా ఎంజాయ్‌ చేశాను. డైరెక్టర్‌ కౌశిక్‌ ‘కిష్కింధపురి’ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. నాకు బాగా ఇష్టమైన జానర్‌ ఇది. హారర్‌ కారణంగా మా సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఇంత సీరియస్‌ హారర్‌ సినిమా చూసి చాలా కాలమైందని సెన్సార్‌ సభ్యులు అభినందించడం ఆనందాన్నిచ్చింది.

👻 ఈ సినిమా కోసం సువర్ణమాయ అనే రేడియో స్టేషన్‌ని సెట్‌గా వేశాం. అలాగే ఓ పాడుబడ్డ గృహంలో షూట్‌ చేశాం. మంగళవారం ఈ సినిమాని మా స్నేహితులతో కలిసి థియేటర్స్‌లో చూశాం... సినిమా అదిరిపోయింది. సౌండ్‌ డిజైనర్‌ రాధాకృష్ణగారు సౌండ్‌ని అద్భుతంగా డిజైన్‌ చేశారు. కౌశిక్‌ మంచి కథ రెడీ చేసుకున్నాడు. అయితే ఇలాంటి జోనర్స్‌ సినిమాలకి బడ్జెట్‌ పరిమితులుంటాయి. కానీ, సాహు గారపాటిగారు ఆడియన్స్‌కి ద బెస్ట్‌ ఇవ్వాలని రాజీ పడకుండా నిర్మించారు. చేతన్‌ భరద్వాజ్‌ అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం అందించారు. 

👻 ‘మా సినిమాకి వచ్చిన ప్రేక్షకుల్లో మొదటి పది నిమిషాల తర్వాత ఎవరైనా ఫోన్‌ పట్టుకుంటే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాను’ అని సరదాగా అన్నాను... దాన్ని వైరల్‌ చేశారు. మా చిత్ర కథ అంత ఆసక్తిగా ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం. నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు... ఇండస్ట్రీలోనే ఉంటాను... భవిష్యత్‌లో దర్శకత్వం కూడా చేస్తాను. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి కథ ఉంటే నేను, నా తమ్ముడు సాయి గణేశ్‌ కలిసి సినిమా చేస్తాం.

చదవండి: బిగ్‌బాస్‌: 5 నెలల బాబు.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా?

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌